సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తారు. పిసినికాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో YSR చేయూత నాలుగో విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేస్తారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒక్కో మహిళకు నాలుగు విడతల్లో మొత్తం 75 వేల చొప్పున అందించేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే మూడు విడతలుగా 18 వేల 750 చొప్పున ప్రభుత్వం 56 వేల 250 చొప్పున అందజేసింది. ఇక నాలుగో విడత వైఎస్సార్ చేయూత పథకం కింద 26 లక్షల 98 వేల 931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు 18 వేల 750 చొప్పున నగదు అందుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలు శాశ్వత జీవనోపాధి పొందేలా ఏపీలోని జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2020 ఆగస్టు 12న ఈ పథకాన్ని ప్రారంభించింది.. ఈ పథకంలో భాగంగా విడతల వారీగా మహిళల ఖాతాల్లో నగదును జమచేస్తోంది..
వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒక్కో లబ్ధిదారునికి నాలుగు విడతల్లో మొత్తం.. రూ.75 వేల చొప్పున అందిస్తారు. ఇప్పటికే మూడు విడతలుగా రూ.18,750 చొప్పున ఇప్పటికవరకు ప్రభుత్వం ప్రతి మహిళకు రూ.56,250 చొప్పున అందజేసింది. ఈసారి చివరి విడత నగదును జమచేయనుంది.
కాగా.. ఈ నాలుగో విడత అందించే నగదుతో ఒక్కొక్క మహిళకు రూ.75 వేల సాయం అందించినట్లవుతుంది. 4వ విడతగా అందించే రూ.5,060.49 కోట్లతో కలిపి మొత్తం ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రూ.19,189.60 కోట్లు అందించింది.
సీఎం వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి కశింకోట చేరుకుంటారు. అక్కడి నుంచి పిసినికాడ చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..