ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని యడ్లపల్లిలో పర్యటించనున్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు ట్యాబ్‌లు పంపిణీ చేసి.. వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులపాటు కొనసాగనుంది. వారంపాటు జరిగే ఈ కార్యక్రమంలో 4లక్షల 59 వేల564 మంది విద్యార్ధులు, 59వేల176 మంది ఉపాధ్యాయులకు 686 కోట్ల విలువైన 5,18,740 శామ్‌సంగ్ ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
ప్రతి ఏటా బైజూస్ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌ల పంపిణీ చేయనున్నట్లు ఇప్పటికే జగన్ సర్కార్ వెల్లడించింది. ఈ ట్యాబ్‌లు ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ప్రతి 8వ తరగతి విద్యార్ధికి 32 వేల రూపాయలు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ప్రణాళిక చేసింది. ఇంటర్నెట్ సౌకర్యం లేని విద్యార్ధులకు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. 8, 9 తరగతుల కంటెంట్ మెమరీ కార్డు ద్వారా ట్యాబ్‌లలో ప్రీలోడ్ చేసి.. విద్యార్థులకు అందించనుంది. అయితే, ఈ ట్యాబ్‌లలో అవాంఛనీయ సైట్లు, యాప్స్‌ను నిరోధించే విధంగా ప్రత్యేక సాఫ్ట్ వేర్ తో ప్రభుత్వం విద్యార్థులకు అందించనుంది.
సీఎం జగన్ బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. 11.00 నుంచి 1.00 వరకు 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..