YS Jagan: మిగతాదంతా నేను చూసుకుంటా.. ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్‌ ఫుల్‌ క్లారిటీ..

|

Jun 07, 2023 | 5:38 PM

CM YS Jagan on Elections: ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఏడాది సమయం ఉండగానే.. ముందస్తు ఊహగానాలు మొదలయ్యాయి. వైసీపీ అధినేత సీఎం జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళతారంటూ జోరుగా చర్చ జరుగుతోంది.

YS Jagan: మిగతాదంతా నేను చూసుకుంటా.. ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్‌ ఫుల్‌ క్లారిటీ..
YS Jagan
Follow us on

CM YS Jagan on Elections: ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఏడాది సమయం ఉండగానే.. ముందస్తు ఊహగానాలు మొదలయ్యాయి. వైసీపీ అధినేత సీఎం జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళతారంటూ జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై.. మంత్రులు క్లారిటీ ఇచ్చినప్పటికీ.. నిర్ణయం సీఎం జగన్‌ తీసుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్నికల సన్నాహాలను మొదలు పెట్టాయి. దీంతో ఏపీలో ముందస్తా..? లేక షెడ్యుల్‌ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా..? అనేది అటు పొలికల్‌ వర్గాల్లో.. ఇటు జనంలో కూడా హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ తరుణంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ముందస్తు ఎన్నికలపై ఫుల్‌ క్లారిటీ ఇచ్చారు. బుధవారం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం ముందస్తు ఎన్నికలపై ఫుల్‌ క్లారిటీ ఇచ్చారు.

కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత సీఎం జగన్‌ కేబినెట్‌ మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. షెడ్యూల్‌ ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఈ సమావేశంలో మంత్రులకు సీఎం స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. ముందస్తు ఉండదని మంత్రులందరికీ క్లియర్‌గా చెప్పినట్టు సమాచారం. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల టైముందని, ఈ సమయమంతా బాగా కష్టపడితే గెలుపు తమదేనని మంత్రులకు సూచించినట్టు తెలుస్తోంది. ఈ తొమ్మిది నెలలు కష్టపడాలని.. మిగిలిన సంగతి తాను చూసుకుంటానని మంత్రులకు జగన్‌ భరోసా ఇచ్చినట్టు సమాచారం.

కాగా.. ఏపీ కేబినెట్‌ సమావేశంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (CPS) ను రద్దు చేయడంతోపాటు.. దాని స్థానంలో కొత్తగా గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (GPS) ను అందుబాటులోకి తీసుకుచ్చేందుకు తీర్మానించారు. అంతేకాకుండా కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు కూడా జగన్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయనున్నట్లు తెలిపారు. దీంతోపాటు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..