AP News: బంపర్ న్యూస్.. అప్పట్నుంచి ఉచిత సిలిండర్.. చంద్రబాబు ప్రకటన

|

Sep 18, 2024 | 7:25 PM

ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ వినిపించారు. మహిళలకు ఉచిత గ్యాస్ పంపిణీపై ప్రకటన చేశారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

AP News: బంపర్ న్యూస్.. అప్పట్నుంచి ఉచిత సిలిండర్.. చంద్రబాబు ప్రకటన
CM Chandrababu Naidu
Follow us on

ఆంధ్రప్రదేశ్ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ వినిపించారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కీలక కామెంట్స్ చేశారు.  ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. పండుగ రోజున మొదటి సిలిండర్ అందిస్తామనన్నారు. ఎన్నికల ప్రచారంలో హామి ఇఛ్చినట్లుగా మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

అటు మందుబాబులకు గుడ్ న్యూస్… 

అక్టోబరు 1 నుంచి ఏపీలో కొత్త లిక్కర్‌ పాలసీ అమలులోకి వస్తోంది. కొత్త మద్య విధానంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ కేబినెట్. కల్లు గీత కులాలకు 10 శాతం మద్యం షాపులు రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బార్ల లైసెన్స్‌ ఫీజులను నాలుగు శ్లాబుల్లో నిర్ణయించారు. మద్యం ధరలను అందుబాటులోకి తెచ్చేందుకు 99 రూపాయలకు క్వార్టర్ మద్యాన్ని అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్‌.

కొన్ని IMFL కంపెనీలతో మాట్లాడి ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా ప్రత్యేక ధరకు ఏపీలో అమ్మేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. కొత్త విధానంలో ప్రీమియర్ షాపులకు అనుమతి ఇవ్వబోతున్నారు. టెంపుల్‌ సిటీ తిరుపతిలో ప్రీమియం షాపులు ఉండవన్నారు మంత్రి పార్థసారధి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.