సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకు..జనం నుండి భారీ స్పందన లభిస్తోంది. వెల్లవలా తరలివస్తున్న ప్రజలు..పూల వర్షాలు..గజమాలలతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ యాత్రలో చేరికలు కూడా కొనసాగుతున్నాయి. పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ, జనసేన నేతలు ఉదయం వైసీపీలో చేరారు. సీఎం జగన్ వారికి కండువాలు కప్పి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఐదవరోజు ఉదయం సత్యసాయి జిల్లా సంజీవపురం నుంచి బయల్దేరిన బస్సు యాత్ర..11 గంటల తర్వాత బత్తలపల్లి చేరుకుంది. సుమారు 40 నిమిషాల పాటు బత్తుల పల్లిలో రోడ్‌షో నిర్వహించారు జగన్. రెండు చోట్ల భారీ గజమాలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.
రామాపురం, కట్ట కిందపల్లి మీదుగా జగన్ యాత్ర రాళ్ల అనంతపురానికి చేరుకుంది. అక్కడ ప్రజలను కలిసి తమ కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు సీఎం. కొందరు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను కలిసి వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. బస్సు యాత్రలో తనను కలిసిన ఓ వృద్ధురాలికి..తానున్నానంటూ భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి. మధ్యాహ్నం ముదిగుబ్బ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుయాత్రకు..భారీ గజమాలతో స్వాగతం పలికాయి వైసీపీ శ్రేణులు. కాలే ఎండను సైతం లెక్కచేయకుండా తరలివచ్చిన జనానికి..బస్సుపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు ముఖ్యమంత్రి.
ముదిగుబ్బ నుంచి బయల్దేరిన మేమంతా సిద్దం బస్సుయాత్ర పట్నం నడింపల్లి, కాళసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కదిరి చేరుకుంది. కదిరి గాంధీచౌక్‌లో వైఎస్ జగన్ రోడ్‌షో చేపట్టారు. రోడ్‌షో అనంతరం కదిరిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ముస్లీంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జగన్ పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు ముగిసిన అనంతరం మోటుకపల్లె, జోగన్నపేట, ఎస్.ములకలపల్లె మీదుగా చీకటిమనిపల్లెకి చేరుకుంది మేమంతా సిద్ధం బస్సుయాత్ర. ఈ రాత్రికి చీకటిమనిపల్లెలోనే బస చేస్తారు సీఎం జగన్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..