Andhra Pradesh: ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్

|

May 09, 2023 | 7:20 AM

‘జగనన్నకు చెబుదాం’ అనే కొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్ మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు దీనిని చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబరు 1902ను ఏర్పాటు చేసింది.

Andhra Pradesh: జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్
CM Jagan
Follow us on

‘జగనన్నకు చెబుదాం’ అనే కొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్ మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు దీనిని చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబరు 1902ను ఏర్పాటు చేసింది. ఆ నంబరుకు ఫోను చేసి సమస్యలు తెలియజేస్తే వాటిని నమోదు చేసుకొని పరిష్కరిస్తారు. వాటి పరిష్కార క్రమాన్ని ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారుడికి తెలియజేస్తారు.

సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగతంగా ఎవరికైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు వైసీపీ సర్కార్ పేర్కొంది. సంక్షేమ పథకాలు, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక లేదా రేషన్‌ కార్డు పొందడం వంటి విషయాల్లో ఏవైన ఇబ్బందులు ఎదురైనా లేదా ప్రభుత్వ పథకాలు అందుకోవడంతో ఏవైన సమస్యలు ఉన్న టోల్‌ఫ్రీ నంబరు 1902కు ఫోను చేయవచ్చు. అంతేకాదు రెవెన్యూ సమస్యలు లేదా ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమస్యలను కూడా తెలియజేయవచ్చు.

అయితే ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారంటే టోల్‌ ఫ్రీ నంబర్ 1902కు ఫోన్‌ చేసి కాల్‌ సెంటర్‌లోని ప్రతినిధికి తమ సమస్యను చెబితే వారు దానిని రాసుకొని ఒక నంబరు (యువర్‌ సర్వీసు రిక్వెస్టు ఐడీ ..వైఎస్సార్‌ ఐడీ) ఇస్తారు. ఆ తర్వాత ఆ సమస్య పరిష్కారానికి ఏ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విషయాలు ఫిర్యాదుదారుడికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. సమస్య పరిష్కరించిన తర్వాత వారు తమ అభిప్రాయం తెలియజేయాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఈ వ్యవహారాన్ని నేరుగా సీఎం కార్యాలయం నుంచే ఈ పర్యవేక్షిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..