అటు వైపు సముద్రం…ఇటువైపు జన సముద్రం. భీమిలి నియోజకవర్గం సంగివలసలో వైసీపీ ఏర్పాటు చేసిన అతి భారీ వేదిక ఇది. గత మీటింగులకు భిన్నమైన “సిద్ధం” సభ. ఇది కేవలం సభా వేదిక మాత్రమే కాదు…బిగ్ ర్యాంప్‌పై నుంచి సీఎం జగన్ నడుచుకుంటూ కార్యకర్తల్లోకి వెళ్లి అందరిని పలకరించి మాట్లాడతారు. వాళ్లతో మమేకమవుతారు. కేడర్ అభిప్రాయాలను ఆయన స్వయంగా తెలుసుకుంటారు. తన పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి గురించి కార్యకర్తలకు సీఎం స్వయంగా చెబుతారు. అంతేకాకుండా విపక్షాల దుష్ర్పచారాలను ఎలా తిప్పి కొట్టాలో కేడర్‌కు జగన్ చెబుతారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి…రాబోయే ఎన్నికల యుద్ధానికి సంసిద్ధం చేయడమే ఈ సిద్ధం సభ లక్ష్యం.
ఏపీలో ఎన్నికల సమరానికి ఎత్తర జెండా అంటూ సిద్ధం అయింది అధికార వైసీపీ. “సిద్దం” పేరుతో ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తోంది. భీమిలి నియోజకవర్గం సంగివలసలో లీడర్ విత్ కేడర్ మీటింగ్ వేదిక ఇది. ఈ తొలి ఎన్నికల సభకు ఉత్తరాంధ్ర నుంచి నాలుగు లక్షల మంది కార్యకర్తలు హాజరు కానున్నారు. ఓవైపు జన సేన – టీడీపీ పొత్తు…స్పీడు బ్రేకర్లు, సీటు బ్రేకర్లు తగిలి కుదుపులకు లోనైన నేపథ్యంలో వైసీపీ సభపై ఏపీ మొత్తం దృష్టి సారించిందంటున్నారు విశ్లేషకులు.
రెండోసారి అధికారం చేపట్టాలనే కృత నిశ్చయంతో ఉన్న సీఎం జగన్…పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. తమ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రజల్లోకి బలంగా తీసుకెళుతోంది జగన్ సర్కార్. అదేసమయంలో గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి మధ్య తేడా చూడాలంటూ ప్రజలను కోరుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో 28 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో తమ పట్టు నిలుపుకోవాలని పక్కా ప్లాన్‌తో అధికార పార్టీ ముందుకు వెళ్తోంది.
ఇక సిద్ధం పేరుతో అత్యంత భారీ స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా 4 రీజనల్ కేడర్ సమావేశాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది వైసీపీ. దీనిలో భాగంగా భీమిలిలో తొలి సమావేశం జరుగుతోంది. ఇక ఈ నెల 30న ఏలూరులో జరగనున్న వైసీపీ ప్రాంతీయ సదస్సుకు ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల కార్యకర్తలు తరలి వెళ్లనున్నారు. ఇలా మొత్తం మీద కేడర్‌తో నాలుగు సభలు నిర్వహించి…వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై పార్టీ కేడర్ కు జగన్ దిశానిర్దేశం చేస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…