అమెరికా నుంచే వరదలపై సీఎం జగన్ రివ్యూ

| Edited By:

Aug 18, 2019 | 12:17 AM

కృష్ణా నది వరదలపై అమెరికా నుంచి ఫోన్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎంఓ అధికారులు పంపిన నివేదికలను జగన్‌ పరిశీలించారు. ఎగువ నుంచి వస్తున్న వరద, విడుదల చేస్తున్న జలాలపై అడిగి తెలుసుకున్నారు. ముంపు బాధిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. బాధితులకు సాయం అందించడంలో ఎలాంటి జాప్యం చేయవద్దని అధికారులకు సూచించారు. వరద సహాయ చర్యలు వేగంగా జరుగుతున్నాయని.. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టిందని అధికారులు జగన్‌కు తెలిపారు. […]

అమెరికా నుంచే వరదలపై సీఎం జగన్ రివ్యూ
Follow us on

కృష్ణా నది వరదలపై అమెరికా నుంచి ఫోన్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎంఓ అధికారులు పంపిన నివేదికలను జగన్‌ పరిశీలించారు. ఎగువ నుంచి వస్తున్న వరద, విడుదల చేస్తున్న జలాలపై అడిగి తెలుసుకున్నారు. ముంపు బాధిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. బాధితులకు సాయం అందించడంలో ఎలాంటి జాప్యం చేయవద్దని అధికారులకు సూచించారు. వరద సహాయ చర్యలు వేగంగా జరుగుతున్నాయని.. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టిందని అధికారులు జగన్‌కు తెలిపారు.

వాషింగ్టన్‌ డీసీలో ఉన్న సీఎం జగన్‌ అక్కడ నుంచి డాలస్‌ బయలుదేరారు. అక్కడ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో పలువురు ప్రముఖలతో భేటీ కానున్నారు. అనంతరం ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.