CM Jagan Tour: భారీ వర్షాలు, వరదలతో గోదారమ్మ ఉగ్ర రూపం దాల్చింది. గోదావరి నదీ(Godavari River) పరివాహక గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు వరదలతో జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. జిల్లాలోని సుమారు 18 మండలాలకు సంబంధించి 51 లంక గ్రామాలు వరద నీటిలో ఉన్నాయి. వరద ముంపుతో లంక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బాధితులకు అండగా ప్రజాపత్రినిధులు పర్యటన చేస్తున్నారు. బాధితులకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లాలో సీఎం జగన్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.
రేపు, ఎల్లుండి(జూలై 26వ తేదీ) సీఎం జగన్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. బాధిత ప్రాంతాలను పరిశీలించి.. వరద బాధితులను పరామర్శించనున్నారు. పి. గన్నవరం మండలంలోని పలు గ్రామాలతో పాటు, లంకల గన్నవరం, మానేపల్లిలో వరద బాధితులను పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పర్యటనకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సీఎం వరద ముంపు గ్రామాలల్లో పర్యటన షెడ్యూల్ ఈరోజు ఖరారు కానున్నదని ఎమ్మెల్యే చిట్టిబాబు చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..