CM YS Jagan: కనకదుర్గ వారధిపై సీఎం జగన్ బస్సుయాత్ర.. జనంలో కలిసి సంఘీభావం తెలిపిన భారతి

|

Apr 13, 2024 | 6:21 PM

రెండోవసారి అధికారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. ఎన్టీఆర్‌ జిల్లాలోకి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రవేశించింది. ప్రకాశం బ్యారేజ్‌పై అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది.

CM YS Jagan: కనకదుర్గ వారధిపై సీఎం జగన్ బస్సుయాత్ర.. జనంలో కలిసి సంఘీభావం తెలిపిన భారతి
Ys Jagan Ys Bharati
Follow us on

రెండోవసారి అధికారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. ఎన్టీఆర్‌ జిల్లాలోకి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రవేశించింది. ప్రకాశం బ్యారేజ్‌పై అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. బస్సుయాత్ర జన జాతరను తలపించింది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కొనసాగుతున్న యాత్రకు అశేష జనవాహిని బ్రహ్మరథం పడుతోంది.

అయితే సందర్భంగా తాడేపల్లి జంక్షన్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి బస్సుయాత్రకు ఆయన సతీమణి వైఎస్ భారతి సంఘీభావం తెలిపారు. బస్సుయాత్రలో వస్తున్న మార్గంలో జనంతో పాటు కలిసిపోయారు భారతి. ఈ సందర్భంగా జనంతో పాటు కలిసిపోయిన భారతి, ముఖ్యమంత్రికి అభివాదం చేశారు. దీంతో ప్రతిగా బస్సులో నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభివాదం చేశారు. ప్రజలు, అభిమానుల మధ్య నుంచే ముఖ్యమంత్రికి భారతి అభివాదం చేశారు.

ఇదిగో వీడియో చూడండి…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..