CM Jagan: పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం జగన్‌.. జనవరి నుంచి పింఛన్ పెంపు

Andhra Pradesh: ఏపీలోని పెన్షన్‌ దారులకు సీఎం జగన్‌ శుభవార్త చెప్పారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్‌ను పెంచుతున్నట్లు ప్రకటించారు. వచ్చే జనవరి నుంచి లబ్ధిదారులకు రూ.2,750 అందిస్తామని తెలిపారు.

CM Jagan: పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం జగన్‌.. జనవరి నుంచి పింఛన్ పెంపు
Cm Jagan

Updated on: Sep 23, 2022 | 1:34 PM

Andhra Pradesh: ఏపీలోని పెన్షన్‌ దారులకు సీఎం జగన్‌ శుభవార్త చెప్పారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్‌ను పెంచుతున్నట్లు ప్రకటించారు. వచ్చే జనవరి నుంచి లబ్ధిదారులకు రూ.2,750 అందిస్తామని తెలిపారు. దీంతో పాటు రాబోయే రోజుల్లో 3 వేల వరకూ పింఛన్‌ పెంచి తాను ఇచ్చిన హామీని నెరవేరుస్తానని సీఎం పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆయన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మూడో విడత వైఎస్సార్ చేయూత పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుటబడి ఉందన్నారు.  ‘మాది మహిళల ప్రభుత్వం.  అమ్మ ఒడి పథకంతో అక్కా చెల్లెమ్మలకు అండగా నిలబడ్డాం. ఈ మూడేళ్లలో మహిళలకు లక్షా 17వేల కోట్లు అందించాం. ఎలాంటి మధ్య వర్తులు, వివక్ష లేకుండా పథకాలు అమలు చేస్తున్నాం.  నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా పథకాలు తీసుకొస్తున్నాం. వచ్చే జనవరి నుంచి పింఛను రూ. 2,750కు పెంచుతున్నాం. అలాగే 3వేల వరకు పెన్షన్ పెంచి గతంలో ఇచ్చిన హామీని కూడా నెరవేరుస్తాం’ అని జగన్‌ తెలిపారు.