Chandrababu: రైతుల పోరాటం వల్లే అమరావతి నిలబడింది.. సిటీని వరల్డ్ క్లాస్‌ రాజధానిగా తీర్చిదిద్దుతాం

అమరావతి రీలాంచ్ అంగరంగ వైభవంగా జరిగింది. ఇంద్రుడు ఏలింది అమరావతే.. ఆంధ్రుల రాజధాని అమరావతే కావడంతో సంతోషించదగ్గ విషయమన్నారు ప్రధాని మోదీ. అమరావతి అభివృద్ధికి.. ఆంధ్రప్రదేశ్‌ డెవలప్‌మెంట్‌కు కేంద్రం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఆర్థికంగా వెంటిలేటర్‌పై ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ ఆక్సిజన్‌ అందించారన్నారు సీఎం చంద్రబాబు.

Chandrababu: రైతుల పోరాటం వల్లే అమరావతి నిలబడింది.. సిటీని వరల్డ్ క్లాస్‌ రాజధానిగా తీర్చిదిద్దుతాం
Chandrababu

Updated on: May 02, 2025 | 7:26 PM

నవ్యాంధ్ర నవరాజధాని అమరావతి పునర్‌ ప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అమరావతి పనుల ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వప్నం సాకారం కాబోతోందన్నారు ప్రధాని మోదీ. ఇవి కేవలం శంకుస్థాపలు కావు.. ఏపీ ప్రగతికి, వికసిత్‌ భారత్‌కు నిదర్శనాలన్నారు. దాదాపు 60 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశామన్నారు ప్రధాని మోదీ.

అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు.. ఐదు కోట్ల మంది ప్రజల సెంటిమెంట్‌ అన్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా 29 వేల మంది రైతులు ఏకంగా 34వేల ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చారన్నారు. ఈ రోజు చరిత్రలో లిఖించదగ్గ రోజన్నారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రధాని మోదీ అందిస్తోన్న సహకారం మరవలేనిదన్నారు చంద్రబాబు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని నిర్మిస్తున్నామన్నారు చంద్రబాబు. అమరావతి చరిత్రలో మోదీ పేరు నిలిచిపోతుందన్నారాయన.

ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో నవనగరాల నిర్మాణం చేపడతాం. ప్రపంచంలోని అన్ని నగరాలకు అమరావతి నుంచి కనెక్టివిటీ ఉంటుందన్నారు. అమరావతి రైతులు వీరోచితంగా పోరాడారు. ఇప్పుడు మళ్లీ రీస్టార్ట్ చేసుకున్నామంటే అది రైతుల విజయమేన్నారు. ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేశారు సీఎం చంద్రబాబు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి మోదీ ఆక్సిజన్ ఇచ్చారు. ఇంకొంచెం సహకరిస్తే ఏపీని బలమైన ఆర్థిక వ్యవస్థగా ఏపీని రూపకల్పన చేస్తామన్నారు సీఎం చంద్రబాబు.

ఈ రోజు చరిత్రలో లిఖించదగ్గ రోజన్నారు సీఎం చంద్రబాబు. ఐదేళ్లు విధ్వంసం జరిగింది. అమరావతి పనులు పునఃప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని నిర్మిస్తున్నాం. ఏఐని కూడా ప్రోత్సహిస్తున్నాం. అమరావతి చరిత్రలో మోదీ పేరు నిలిచిపోతుందన్నారు సీఎం చంద్రబాబు. కులగణనతో అతిపెద్ద సంస్కరణ చేపట్టారని మోదీని కొనియాడారు సీఎం చంద్రబాబు. కులగణన అనేది దేశానికి గేమ్‌ ఛేంజర్‌గా మారుతుందన్నారు.

ఎంతో బిజీగా ఉన్న ప్రధాని మోదీ ఆంధ్రుల కోసం అమరావతికి రావడం సంతోషంగా ఉందన్నారు పవన్‌. ఏపీపై మోదీ నిబద్ధతకు ఇదే నిదర్శనమన్నారు. అమరావతి రైతుల త్యాగానికి ఫలితం దక్కిందన్నారు పవన్. అమరావతి పునర్ ప్రారంభ పనుల సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. మరోవైపు డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఇక అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు కూటమి నేతలు.