ప్లాస్టిక్ రహత రాష్ట్రంగా ఏపీ.. సీఎం చంద్రబాబు విజన్ ఎలా ఉండబోతోంది..?

ప్లాస్టిక్ అనేది కేవలం చెత్త కాదు, అది భవిష్యత్తుకు ముప్పు. నీటిలో కరగదు, నేలలో కలవదు, మన శరీరంలోకి మాత్రం చొచ్చుకుపోతుంది. చేపల కడుపులో ప్లాస్టిక్, మన ప్లేట్‌లో అదే ప్లాస్టిక్. అందుకే ప్లాస్టిక్‌కు బ్రేక్ వేయాలంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మరి ప్లాస్టిక్ రహత రాష్ట్రంగా మార్చేందుకు ఏపీ సీఎం విజన్ ఎలా ఉండబోతోంది.?

ప్లాస్టిక్ రహత రాష్ట్రంగా ఏపీ..  సీఎం చంద్రబాబు విజన్ ఎలా ఉండబోతోంది..?
Cm Chandrababu On Plastic Free State

Updated on: Dec 20, 2025 | 11:05 PM

ప్లాస్టిక్ అనేది కేవలం చెత్త కాదు, అది భవిష్యత్తుకు ముప్పు. నీటిలో కరగదు, నేలలో కలవదు, మన శరీరంలోకి మాత్రం చొచ్చుకుపోతుంది. చేపల కడుపులో ప్లాస్టిక్, మన ప్లేట్‌లో అదే ప్లాస్టిక్. అందుకే ప్లాస్టిక్‌కు బ్రేక్ వేయాలంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మరి ప్లాస్టిక్ రహత రాష్ట్రంగా మార్చేందుకు ఏపీ సీఎం విజన్ ఎలా ఉండబోతోంది.?

ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం డెడ్‌లైన్ పెట్టుంది. ఈసారి మాటలకే కాదు, మన అలవాట్లకూ పరీక్ష అని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు. జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలని లక్ష్యాన్ని ఖరారు చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన సందేశం ఇచ్చారు. అయితే ఈలక్ష్యం చేరుకోవాలంటే ప్రభుత్వమే కాదు, ప్రజలు భాగస్వామ్యం కావాలంటున్నారు. చట్టం చేస్తే భయం ఉంటుంది, అలవాటు మార్చితే ఫలితం ఉంటుందంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్లాస్టిక్ సమస్య కొత్తది కాదు. పట్టణాల్లో డ్రెయిన్లు మూసుకుపోవడం, గ్రామాల్లో కాలువల్లో ప్లాస్టిక్ పేరుకుపోవడం, తీర ప్రాంతాల్లో సముద్రంలోకి చెత్త చేరడం, ఇవన్నీ రాష్ట్రం ఎన్నాళ్లుగానో చూస్తున్న వాస్తవాలు. ముఖ్యంగా వ్యవసాయ రాష్ట్రమైన ఏపీలో నేలలో కలిసిపోయే ప్లాస్టిక్ వల్ల భూమి సారవంతం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ రహిత రాష్ట్రం అనే ఆలోచన పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాదు, వ్యవసాయం–ఆరోగ్యం–పర్యాటకం అన్నింటికీ సంబంధించిన సమగ్ర విజన్‌గా చూస్తోంది ఏపీ సర్కార్.

ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని మూడు స్థాయిల్లో అమలు చేయాలనుకుంటోంది. మొదటిది – పాలసీ స్థాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై కఠిన నియంత్రణలు, ప్రత్యామ్నాయాల వినియోగానికి ప్రోత్సాహం, ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా మారడం. రెండోది – గ్రామం నుంచి నగరం వరకూ అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయడం. పంచాయతీల్లో చెత్త వేరు చేసే విధానం, తడి–పొడి చెత్తకు స్పష్టమైన విభజన, ప్లాస్టిక్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం. పట్టణాల్లో మున్సిపల్ వ్యవస్థను బలోపేతం చేసి, ప్లాస్టిక్ డ్రెయిన్లలోకి వెళ్లకుండా మూలంలోనే ఆపాలన్నది లక్ష్యం. ఇక మూడోది – ప్రజల భాగస్వామ్యం. ఇదే అసలైన గేమ్ ఛేంజర్. ఆంధ్రప్రదేశ్‌లో స్వయం సహాయక సంఘాలు, మహిళా సంఘాలు బలంగా ఉన్నాయి. క్లాత్ బ్యాగ్‌లు, జూట్ బ్యాగ్‌లు, పేపర్ ప్యాకేజింగ్ తయారీకి మహిళా సంఘాలను భాగస్వాముల్ని చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ప్లాస్టిక్ తగ్గితే పర్యావరణమే కాదు, గ్రామీణ ఉపాధి కూడా పెరుగుతుంది. ఇదే ఏపీ మోడల్ అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.

పర్యాటక రాష్ట్రంగా ఎదగాలన్న ఆంధ్రప్రదేశ్ ఆశయానికి ఇది కీలకమైన అడుగు. అమరావతి నుంచి అరకు వరకు, విశాఖ నుంచి తిరుపతి వరకు – ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా మారితే రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుందని. “క్లీన్ ఏపీ – గ్రీన్ ఏపీ” అన్న బ్రాండ్ ఇక్కడే రూపుదిద్దుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..