ఆ పథకానికి విరాళాలు ఇవ్వండి.. అకౌంట్ వివరాలు వెల్లడించిన సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి గుడివాడలోని అన్న క్యాంటిన్‎లో భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. పేదల కడుపు నింపే ఈ పథకంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఆ పథకానికి విరాళాలు ఇవ్వండి.. అకౌంట్ వివరాలు వెల్లడించిన సీఎం చంద్రబాబు
Cm Chandrababu

Updated on: Aug 15, 2024 | 10:18 PM

ఏపీ సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి గుడివాడలోని అన్న క్యాంటిన్‎లో భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. పేదల కడుపు నింపే ఈ పథకంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఏపీ వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. కేవలం రూ.5కే పేదలకు మంచి నాణ్యమైన భోజనం అందుతుందని తెలిపారు. మూడు పూటల వివిధ రకాల ఆహారపదార్థాలతో ప్రత్యేక మెనూను రూపొందించామన్నారు. దీనిని హరేకృష్ణ చారిటబుల్ ట్రస్ట్, అక్షయపాత్ర వారు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి విరాళాలు అందించాలని ప్రజలను కోరారు. దీనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా వెల్లడించారు.

డొనేషన్ చేసేందుకు బ్యాంకు ఖాతా వివరాలు:

Bank Name- SBI,

ANNA CANTEENS A/C – 37818165097,

IFSC – SBIN0020541,

Branch – Chandramouli Nagar,

City – Guntur,

State – Andhrapradesh.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..