Andhra Pradesh: యువకుడి ప్రాణం తీసిన స్నేహితుల మధ్య జరిగిన చిన్న వివాదం..!

కాకినాడ నగరంలో అర్ధరాత్రి స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ విషాదానికి దారితీసింది. భానుగుడి సెంటర్‌లో సతీష్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. సతీష్‌కు అతని స్నేహితుడు, జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న సాయికిరణ్‌తో చిన్న వివాదం తలెత్తింది.

Andhra Pradesh: యువకుడి ప్రాణం తీసిన స్నేహితుల మధ్య జరిగిన చిన్న వివాదం..!
Crime News

Updated on: Aug 26, 2026 | 10:18 AM

కాకినాడ నగరంలో అర్ధరాత్రి స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ విషాదానికి దారితీసింది. భానుగుడి సెంటర్‌లో సతీష్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. సతీష్‌కు అతని స్నేహితుడు, జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న సాయికిరణ్‌తో చిన్న వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది.

గొడవ తీవ్రరూపం దాల్చడంతో సాయికిరణ్ కర్రతో సతీష్‌పై దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన సతీష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే భానుగుడి సెంటర్‌కు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించి, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)కు తరలించారు. హత్యకు దారితీసిన అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుల మధ్య జరిగిన చిన్న వివాదం చివరకు హత్యకు దారితీయడంతో స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us