Tirumala: అలిపిరి గట్టుపై సిగరెట్‌ ఫైట్‌.. దమ్ము ఇవ్వలేదని ప్రాణం తీశాడు..

సిగరెట్ క్యాన్సర్‌కు దారి తీసి ఎన్నో ప్రాణాలను తీస్తుందని మీకు తెల్సు. కానీ సిగరెట్ కారణంగా అలిపిరిలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఫైట్ జరిగింది. ఓ ప్రాణం పోయింది.

Tirumala: అలిపిరి గట్టుపై సిగరెట్‌ ఫైట్‌.. దమ్ము ఇవ్వలేదని ప్రాణం తీశాడు..
Cigarette ( Representative Image)

Updated on: Oct 19, 2022 | 6:10 PM

పొగతాగడం ఆరోగ్యానికి హానికరం.  తాటికాయంత అక్షరాలతో హెచ్చరించినా లెక్కలేదు. దమ్మేస్తే కాలేయం కుళ్లిపోయి .. శాల్తీ క్యాన్సర్‌ ఖాతాలో కలిసి సచ్చిపోతావ్‌ రోయ్‌ … అని పుర్ర బొమ్మేసి వార్నింగ్‌ ఇచ్చిన వినదేవరు? ఆగేదెవరు? చెప్పండి. దమ్ము మీద దమ్ము.. వేస్తూ రింగులు ఊదుతూ ఫోజుకొడుతూ పొగతాగడం ఓ ఫ్యాషన్‌.. పైగా పొగతాగని వాడు దున్నపోతై పుట్టన్‌.. అని గిరీశం లెవల్‌లో బిల్డప్ ఇస్తారు కొందరు.  ఎక్కడ చూసిన స్మోకింగ్ రాయుళ్లు కనిపిస్తూనే ఉంటారు. కొందరైతే పక్కన పిల్లలు, మహిళలు ఉన్నారని కూడా చూడకుండా గుప్పుగుప్పున ఊదుతూనే ఉంటారు. ప్రజారోగ్యానికి తూట్లు పొడిచే పొగ సీన్ల గురించి ఎంత చెప్పినా తక్కేవే లేండి. ఇవన్నీ ఓ లెక్క… టెంపుల్‌ సిటి తిరుపతిలో… అలిపిరి గట్టుపై సిగరెట్‌ ఫైట్‌ మరో లెక్క.

మొక్కే కదా అని పీకేస్తే ..పీక తెగుద్దా లేదో కానీ కానీ సిగరెట్‌ పీక కోసం జరిగిన గలాటాలో ఏకంగా ప్రాణాలే తీశాడు ఓ కేటుగాడు. అదీ ఆఫ్ట్రాల్‌ సిగరెట్‌ కోసం… భగ్గమన్న జనం నిందితుడ్ని చెట్టుకు కట్టేసి చెంపలు వాయించారు.  వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని అంబూరుకు చెందిన కుమార్‌ అనే వ్యక్తి తిరుమలకు వచ్చాడు. తమిళనాడుకు చెందిన విఘ్నేష్ అనే మరో వ్యక్తి కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చాడు. విఘ్నేశ్ అలిపిరి దగ్గర ఓ వైన్‌షాప్‌లో మద్యం తాగాడు. రోడ్డుపక్కన ఆగి సిగరెట్‌ ముట్టించాడు. టైమ్‌ రాత్రి 11 గంటలు. అప్పుడే కుమార్‌ అక్కడకు వచ్చాడు. బాష తెలిసింది. మాట కలిసింది. మనం మనం తమిళ్‌.. ఓ సిగరెట్‌ ఇవ్వు తంబి అన్నాడు కుమార్. విఘ్నేష్‌ లేదన్నాడు. కనీసం ఓ దమ్మైనా ఇవ్వమని రిక్వెస్ట్‌ చేశాడు కుమార్‌. అలా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. తాగిన మైకంలో ఇద్దరూ ఫైటింగ్‌ దిగారు. జనం గుమిగూడేలోపే దారుణం జరిగింది. కుమార్‌ రాయితో కొట్టడంతో విఘ్నేష్‌ రక్తం మడుగులో కుప్పకూలాడు. స్పాట్‌లో చనిపోయాడు. పొగ లొల్లి అలా నిండు ప్రాణం తీసింది. జనం కుమార్‌ను చితక్కొట్టి చెట్టుకు కట్టేశారు. సీన్‌లోకి వచ్చిన పోలీసులు..నిందితుడు కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఆఫ్ట్రాల్‌ సిగరెట్‌ కుక్కుర్తి కోసం ఓ నిండు ప్రాణం బలైపోయింది. చూశారుగా సిగరెట్‌తో డేంజర్‌ అట్లుంటది. పొగతాగడం ఆరోగ్యపరంగా హానికరం..ప్లస్‌ ఇలా కూడా ప్రాణానికి ప్రమాదకరం.. పొగరాయుళ్లు జర భద్రం బికేర్‌ఫుల్‌.

మరిన్ని ఏపీ వార్తల కోసం