Nellore: హైవేపై తీవ్రగాయాలతో MLC.. అటుగా వెళ్తున్న జానీ మాస్టర్ వెంటనే స్పందించి..

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాల పాలయ్యారు. పర్వతరెడ్డి పీఏ వెంకటేశ్వర్లు స్పాట్‌లోనే మృతిచెందారు. విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో జానీ మాస్టర్...

Nellore: హైవేపై తీవ్రగాయాలతో MLC.. అటుగా వెళ్తున్న జానీ మాస్టర్ వెంటనే స్పందించి..
Road Accident

Updated on: Jan 05, 2024 | 9:45 AM

నెల్లూరు హైవేపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.  కొడవలూరు మండలం రేగడిచెలిక సమీపంలో వెనక నుంచి లారీని ఢీకొట్టింది ఎమ్మెల్సీ కారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ పీఏ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌ విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు.  టీచర్స్‌ MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయనకు ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో అయిదుగురు ఉన్నట్లు తెలిసింది. స్థానికుల సమాచారం మేరకు MLC కారుకు ముందు వెళుతున్న లారీ టైరు పంక్చరు కావడంతో ఒక్కసారిగా స్లో అయ్యింది. ఆ క్రమంలో కారు వెళ్లి లారీ వెనుక భాగంలో ఢీకొని డివైడర్‌పై పడిపోయింది. ఎమ్మెల్సీ వాహనం డ్యామేజ్ చూస్తే.. ప్రమాద తీవ్రత ఎంత ఉందో అర్థమవుతుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ వెంటనే స్పందించారు.  MLC పర్వతరెడ్డిని, ఇతర క్షతగాత్రులను తన కారులో నెల్లూరు అపోలో హాస్పిటల్‌కు తరలించారు. జానీ మాస్టర్ స్పందించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.