Watch Video: వామ్మో.. హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యం.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి హైవేపై మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారితో సహా ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ కారు దేవరపల్లి మండలం జాతీయ రహదారిపై వస్తోంది..

Updated on: Jan 02, 2024 | 8:32 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి హైవేపై మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారితో సహా ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ కారు దేవరపల్లి మండలం జాతీయ రహదారిపై వస్తోంది.. ఈ క్రమంలో బంధపురం వద్దకు రాగానే కారు టైరు పేలి డివైడర్‌ను ఢీకొట్టి.. అవతలి వైపునకు దూసుకెళ్లింది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న కారును వేగంగా ఢీకొట్టింది.. రెండు కార్లు వేగంతో ఉన్నాయి. బంధపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 19 నెలల చిన్నారి, ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే 19 నెలల చిన్నారికి తీవ్రగాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మరణించినట్లు పోలీసులు తెలిపారు.

కాగా.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..