CM Jagan: వారంరోజుల్లో ఎన్యుమరేషన్‌ పూర్తిచేయాండి.. అకాల వర్షాలపై కలెక్టర్లకు సీఎం జగన్ కీలక ఆదేశాలు..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Mar 19, 2023 | 12:15 PM

రాష్ట్రంలో అకాల వర్షాలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంఓ అధికారులతో సమీక్షించారు. అకాల వర్షాలు, వివిధ ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టంపై అధికారుల నుంచి తెలుసుకున్నారు. పంట నష్టపరిహారంపై వెంటనే ఎన్యుమరేషన్‌ మొదలుపెట్టాల్సిందిగా అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

CM Jagan: వారంరోజుల్లో ఎన్యుమరేషన్‌ పూర్తిచేయాండి.. అకాల వర్షాలపై కలెక్టర్లకు సీఎం జగన్ కీలక ఆదేశాలు..
CM Jagan

అకాల వర్షాలపై అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వానల వల్ల జరిగిన పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ మొదలు పెట్టాలని సూచించారు. వారం రోజుల్లో దీనికి సంబంధించి రిపోర్టులను ఇవ్వాలని సూచించారు. రిపోర్టుల ఆధారంగా రైతులకు సహాయపడేందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. వారంరోజుల్లో ఈ ఎన్యుమరేషన్‌ పూర్తిచేయాల్సిందిగా కలెక్టర్లుకు ఆదేశాలు జారీచేయాలన్నారు. ఎన్యుమరేషన్‌ పూర్తయ్యాక రైతులను ఆదుకునేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. భారీవర్షాల వల్ల ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్లును ఆదేశించారు సీఎం జగన్.

ఇదిలావుంటే, మరో వైపు ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పిడుగులు, వడగళ్లు హడలెత్తిస్తున్నాయి. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి జార్ఖండ్‌ వరకు.. రాయలసీమ, తెలంగాణ, ఒడిశాల మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ వరకు కొనసాగుతున్న ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

ఆదివా­రం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు­గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu