CM Jagan Clarifies: చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎవరూ సభలో మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయనే తన చిన్నాన్న, చెల్లి గురించి మాట్లాడారన్నారు. గతంలో జరిగిన హత్యలపై విచారణ జరగాలని తమ సభ్యులు అంటే దాన్ని మరో రకంగా మార్చి డ్రామా క్రియేట్ చేశారని విమర్శించారు సీఎం జగన్. గతంలో తన చిన్నాన్నను ఓడించారని, ఆయన్ను వాళ్లే ఏదో ఒకటి చేసి ఉంటారని వ్యాఖ్యానించారు సీఎం జగన్. చంద్రబాబు మాటలు చూస్తే ఒక్కోసారి బాధ అనిపిస్తుందన్నారు.
ఆ సమయంలో తాను సభలో లేనని అన్నారు సీఎం జగన్. తాను సభకు రాకముందు కలెక్టర్లతో వర్షాలపై సమీక్షచేసినట్లుగా తెలిపారు. సభకు వచ్చిన తర్వాత జరిగిన పరాణామాలేంటో తెలుసుకున్నాను. సభలోకి వచ్చేసరికి చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నారు. చంద్రబాబు మీద తాము వ్యతిరేకంగా ఉన్నామని తీర్పిచ్చారు.
ఊహించని విధంగా ప్రజల వ్యతిరేకత చూశారు. మండలిలో కూడా వారికున్న బలం పూర్తిగా మారిపోయింది. మండలిలో కూడా వైయస్సార్‌సీపీ బలం గణనీయంగా పెరిగింది.
రైతులకు సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు.. ఒకవైపున వర్షాల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్న సందర్భాల్లో .. ప్రతిపక్షం వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వాలి కానీ అలా జరగడం లేదని సీఎం అన్నారు. పలానా మాదిరిగా చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పొచ్చు. అలాంటి పరిస్థితిని పూర్తిగా పక్కనపెట్టేసి, ప్రజలు ఎలా ఉన్నా పర్వాలేదు, ప్రజలు ఎలా ఉన్నా అభ్యంతరం లేదు నా ఎజెండా రాజకీయ అజెండానే ప్రతి అంశంలోనూ.. నాకు రాజకీయ లబ్ధి జరగాలి, లబ్ధి చేకూర్చుకునేలా ప్రవర్తిస్తాను అనే ధోరణిలోకి చంద్రబాబు వెళ్లిపోతారని విమర్శించారు సీఎం జగన్.
ఇవి కూడా చదవండి: Petrol Diesel Offer Price: పెట్రోల్, డీజిల్‌పై డిస్కౌంట్ కావాలా.. అయితే ఈ క్రెడిట్ కార్డుతో కొట్టించండి..
YSRCP vs TDP: సభలో వ్యక్తిగత దూషణల పర్వం.. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన అంబటి రాంబాబు