393 అంబాసిడర్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను మూడు దశాబ్దాల క్రితం ఉపయోగించిన అంబాసిడర్ కారును పరిశీలించారు. పార్టీ కార్యాలయంలో పార్క్ చేసిన తన 393 నెంబర్ గల అంబాసిడర్‌ను చూసి పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఆ కారుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

393 అంబాసిడర్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
Ap Cm Chandrababu Naidu Ambassador Car

Edited By: Balaraju Goud

Updated on: Oct 31, 2025 | 11:04 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను మూడు దశాబ్దాల క్రితం ఉపయోగించిన అంబాసిడర్ కారును పరిశీలించారు. పార్టీ కార్యాలయంలో పార్క్ చేసిన తన 393 నెంబర్ గల అంబాసిడర్‌ను చూసి పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఆ కారుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈరోజు పాత స్నేహితుడిని కలిశాను అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

393 నెంబరుతో ఉండే ఈ అంబాసిడర్ కారు చంద్రబాబు నాయుడు సొంత వాహనం. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 393 నెంబర్ ఉన్న అంబాసిడర్ కాన్వాయిలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. 393 అంబాసిడర్ అంటేనే చంద్రబాబు బ్రాండ్ కార్ అనేలా ఈ కారు గుర్తింపు పొందింది. ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు.. భధ్రతా పరంగా ఆధునిక వాహనాలు వినియోగిస్తున్నారు. తన సొంత కారు అయిన నాటి అంబాసిడర్ ను మాత్రం అపురూపంగానే చూసుకుంటున్నారు.

ఇప్పటి వరకు హైదరాబాదులో ఉన్న ఈ కారును అమరావతికి తీసుకువచ్చారు. ఈ కారును తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంచనున్నారు. పార్టీ కార్యాలయానికి వచ్చి.. తిరిగి వెళ్తున్న సమయంలో ఆనాడు తాను వాడిన అంబాసిడర్ కారు కనిపించింది. దీంతో కారును దగ్గరకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని పరిశీలించారు. ఆ కారులో తన ప్రయాణ స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు.

‘‘ఈరోజు పాత స్నేహితుడిని కలిశా.. ఒకప్పుడు ఈ కారులోనే ఆంధ్రప్రదేశ్‌ అంతా తిరిగి ప్రజలతో కలిశా. ఇవి కేవలం మనల్ని మైళ్ళ దూరం తీసుకెళ్లిన వాహనాలు మాత్రమే కాదు, మనల్ని తీర్చిదిద్దిన అనేక జ్ఞాపకాలు సాక్షులు కూడా. మీ జీవిత పయనంలో అలాంటి జ్ఞాపకాల తోడు మీకుందా?’’ అంటూ ప్రశ్నించారు సీఎం చంద్రబాబు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..