Anantapur District: మాకేదీ వినిపించదు..మాటలు కూడా రావు..! నమ్మారో ఇక అంతే!!

|

Feb 03, 2022 | 3:34 PM

మూగ, చెవిటి వారికి సర్వం కల్పించడానికి helping society for deaf అనే సంస్థను ప్రారంభిస్తున్నాము... అంటూ వచ్చి మిమ్మల్ని మాయ చేస్తారు. ఏమార్చి క్షణాల్లో అక్కడ విలువైనవి అన్నీ కొట్టేస్తారు.

Anantapur District: మాకేదీ వినిపించదు..మాటలు కూడా రావు..! నమ్మారో ఇక అంతే!!
Robber
Follow us on

Mobile phone theft:  దొంగలు(Thieves )రూటు మార్చారు. దొంగతనాలు చెయ్యటానికి దివ్యాంగులను వాడేస్తున్నారు. అనంతపురం జిల్లాలో సరికొత్త పంథాలో దొంగతనాలకు తెగబడ్డారు. అనంతపురం జిల్లాలో ఇటీవల కాలంలో పెరుగుతున్న దొంగతనాలు స్థానికులను కలవరపెడుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, విరాళాల సేకరణ పేరుతో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా తాజాగా గుంతకల్లు(Guntakal)లో కలకలం సృష్టించింది. మూగ, చెవిటి వారికి సర్వం కల్పించడానికి helping society for deaf అనే సంస్థను ప్రారంభిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల మూగ చెవిటి వారికి సకల వసతులు అక్కడే కల్పిస్తున్నాం… మీకు చేతనైన సహాయం చేయండి..అంటూ రసీదు బుక్కు,… కరపత్రాలతో సహాయం అడగడానికి బయల్దేరారు… తమకు మాటలు రావని, మూగవాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ విరాళాల కోసం ఓ కాలేజీలోకి ప్రవేశించి… చాకచక్యంగా సిబ్బందిని దృష్టిని మరల్చారు. కాలేజీలో ఉన్న విలువైన సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లారు.

కాలేజీ సిబ్బందితో సైగలతో మాట్లాడుతూ కొన్ని పేపర్లు కింద వేశారు.. కిందపడ్డ పేపర్లను మహిళా సిబ్బంది తీసుకునే లోపే ఒక ఫోన్ కొట్టేశారు.. ఆమె దృష్టి మరల్చి మరో ఫోను కాజేశారు..రెందు సెల్‌ఫోన్ల విలువ సుమారు లక్ష రూపాయలకు పైగానే ఉంటుందని బాధితులు వాపోయారు.
పాపం అని సహాయం చేయబోతే,… ఇలా మోసాలకు పాల్పడిన ముఠాపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు, కాలేజీ సిబ్బంది తెలిపారు. దొంగలను పట్టుకుని తమ వస్తువులు రికవరీ చేయాలని కాలేజీ యాజమాన్యం విజ్ఞప్తి చేశారు. ఇటువంటివారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.

Also Read: తిరుమలకు వెళ్లే వెంకన్న భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్.. ఈరోజు నుంచే..