Andhra Pradesh: సీబీఐ నుంచి మాట్లాడుతున్నాం.. మాజీ ఎమ్మెల్యేకు వాట్సప్ కాల్ చేసిన మహిళ.. కట్ చేస్తే, రూ.50లక్షలు..

|

Jul 09, 2024 | 5:43 PM

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. మోసానికి కాదేది అనర్హం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. వేలు.. రూ. లక్షలు, కోట్లు దండుకుంటున్నారు. మ‌నిషి ఆశ‌ను, భయాన్ని ఆసరాగా చేసుకుని దొరికిన కాడికి దోచుకుంటున్నారు. సామాన్యులతోపాటు ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు సైతం సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే..

Andhra Pradesh: సీబీఐ నుంచి మాట్లాడుతున్నాం.. మాజీ ఎమ్మెల్యేకు వాట్సప్ కాల్ చేసిన మహిళ.. కట్ చేస్తే, రూ.50లక్షలు..
Cybercrime
Follow us on

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. మోసానికి కాదేది అనర్హం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. వేలు.. రూ. లక్షలు, కోట్లు దండుకుంటున్నారు. మ‌నిషి ఆశ‌ను, భయాన్ని ఆసరాగా చేసుకుని దొరికిన కాడికి దోచుకుంటున్నారు. సామాన్యులతోపాటు ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు సైతం సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే మోసగాళ్ల బారిన పడి లక్షలు పోగొట్టుకున్నారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్ఆర్ జయదేవనాయుడు (85) మోసగాళ్ల చేతిలో చిక్కి రూ. 50 లక్షలు పోగొట్టుకున్న ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.. గత శనివారం ఆయనకు వాట్సప్ ఫోన్ చేసిన ఓ మహిళ మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయని, తాము అరెస్ట్ చేసిన నాయక్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చిందంటూ జయదేవనాయుడికి చెప్పింది.

అంతేకాకుండా.. మనీలాండరింగ్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని జయదేశనాయుడిని బెదిరించింది. ఈ క్రమంలో మనీలాండరింగ్‌తో తనకు ఎలాంటి సంబంధమూ లేదని జయదేవనాయుడు ఆమెకు తేల్చి చెప్పారు. దీంతో తమ పై అధికారితో మాట్లాడాలంటూ ఫోన్‌ను మరో వ్యక్తికి కనెక్ట్ చేసింది. ఆ తర్వాత వేరే వ్యక్తి మాట్లాడుతూ.. తాము ఫోన్ చేసిన విషయం ఎవరికీ చెప్పొద్దని, బయటకు తెలిస్తే వెంటనే అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన్ను మరింత బెదిరించాడు.

తాము సీబీఐ అకౌంట్ నంబర్ పంపిస్తామని, ఆ ఖాతాకు డబ్బులు పంపిస్తే తనిఖీ చేసి మూడు రోజుల్లో తిరిగి డబ్బులు బదిలీ చేస్తామని మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడికి మాయమాటలు చెప్పాడు.. ఇదంతా నమ్మిన జయదేవనాయుడు శనివారం బ్యాంకుకు వెళ్లి ఆరు ఖాతాల నుంచి ఆర్టీజీఎస్ ద్వారా రూ.50 లక్షలు పంపించారు.

ఈ క్రమంలోనే.. ఆదివారం అమెరికా నుంచి కుమారుడు ఫోన్ చేస్తే జయదేవనాయుడు జరిగిన విషయం చెప్పారు. దీంతో అలా ఉండదంటూ తనయుడు చెప్పడంతో.. వెంటనే పోలీసులను ఆశ్రయించారు.. తాను మోసపోయినట్టు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జయదేవనాయుడు ఫిర్యాదు మేరకు తిరుపతి పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..