Andhra Pradesh: పొత్తు పొడుస్తోంది..! ఢిల్లీకి చంద్రబాబు.. ఏపీలో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు..

|

Feb 07, 2024 | 5:18 PM

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. టీడీపీ- జనసేనతో పొత్తుపై బీజేపీ స్పీడ్‌ పెంచింది. దానిలో భాగంగా.. బీజేపీ హైకమాండ్‌ పిలుపుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయల్దేరారు.

Andhra Pradesh: పొత్తు పొడుస్తోంది..! ఢిల్లీకి చంద్రబాబు.. ఏపీలో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు..
Chandrababu Amit Shah
Follow us on

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. టీడీపీ- జనసేనతో పొత్తుపై బీజేపీ స్పీడ్‌ పెంచింది. దానిలో భాగంగా.. బీజేపీ హైకమాండ్‌ పిలుపుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయల్దేరారు. ఢిల్లీ టూర్‌లో భాగంగా.. ఇవాళ రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏపీలో రాజకీయ పరిస్థితులు.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై అమిత్‌షాతో చర్చించనున్నారు. పొత్తులపై ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలను ఆరా తీసిన అమిత్‌ షా.. పొత్తు అవసరాలు, పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే.. ఇద్దరికీ మేలు జరిగేలా పొత్తులు ఉండాలంటూ బీజేపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతోనే చంద్రబాబుకు ఢిల్లీ రావాలని బీజేపీ అధిష్టానం నుంచి పిలుపువచ్చింది. అయితే, ఈ భేటీలో పొత్తులు, సీట్లతోపాటు కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు.

ఇక.. పొత్తుల్లో భాగంగా.. 8 ఎంపీ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని బీజేపీ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. 3 ఎంపీ సీట్లు, 5 నుంచి 10 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని టీడీపీ అగ్రనేతలు చెప్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే.. అమిత్‌షా- చంద్రబాబు చర్చల్లో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

వీడియో చూడండి..

ఇదిలాఉంటే.. ఇటీవల చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సీట్ల పంపకాలతోపాటు.. బీజేపీతో పొత్తు వ్యవహారం కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే, తాజా భేటీ అనంతరం పవన్ కల్యాణ్, చంద్రబాబు కూడా మళ్లీ భేటీ అయి.. పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చించనున్నట్లు సమాచారం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..