Andhra Pradesh: అధికారంలోకి రాగానే భోగపురం విమానశ్రయానికి ఆ మహనీయుని పేరు పెడతామన్న చంద్రబాబు

|

Jul 05, 2023 | 8:41 AM

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే భోగాపురం ఎయిర్‌‌పోర్టుకు అల్లూరి సీతారామ రాజు పేరు పెడతామని ప్రకటించారు. అలాగే అమరావతిలో కూడా ఆ మహనీయుడి పేరుతో ఓ స్మృతివనం ఏర్పాటు చేస్తా్మని తెలిపారు.

Andhra Pradesh: అధికారంలోకి రాగానే భోగపురం విమానశ్రయానికి ఆ మహనీయుని పేరు పెడతామన్న చంద్రబాబు
Chandrababu
Follow us on

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే భోగాపురం ఎయిర్‌‌పోర్టుకు అల్లూరి సీతారామ రాజు పేరు పెడతామని ప్రకటించారు. అలాగే అమరావతిలో కూడా ఆ మహనీయుడి పేరుతో ఓ స్మృతివనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. మంగళవారం రోజున అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు అన్ని పార్టీల రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొన్నారు. వంద సంవత్సరాల క్రితం 27 ఏళ్ల వయసులోనే చనిపోయన అల్లూరిని ఇప్పటివరకు సమాజం గుర్తుంచుకుందంటే అదే ఆయన గొప్పతనమని చంద్రబాబు నాయుడు అన్నారు.

అలాంటి మహనీయుల్ని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. 2014లో తాను సీఎం అయిన తర్వాత అల్లూరి సీతారామరాజు జయంతిని ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించాలని జీవో విడుదల చేశానని చెప్పారు. ప్రస్తుతం కేంద్రం కూడా అల్లూరి జయంతని వైభవంగా నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభత్వం మాత్రం ఆయన్ని వదిలేయడం దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ముఖ్యమైన కార్యక్రమాలు ఏముంటాయని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..