అవినీతి కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు.. CID రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందంటే..?

|

Sep 09, 2023 | 11:48 AM

AP Skill Development Scam Case: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో సీఐడీ అధికారులు చంద్రబాబుపై అనేక అభియోగాలు మోపారు. ప్రభుత్వ నిధులు రూ.371 కోట్ల మేర అవినీతి జరిగిందని, షెల్‌ కంపెనీల ద్వారా రూ. 241 కోట్ల స్కాం చేశారని ఆరోపించారు. కేబినెట్‌ను తప్పుదారి పట్టించి ఆ తర్వాత ఒప్పందంలో..

అవినీతి కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు.. CID రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందంటే..?
Chandrababu Naidu Arrest
Follow us on

Chandrababu Naidu Arrest: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్‌ హాల్‌ వద్ద ఇవాళ తెల్లవారుజామున సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ అధికారులు 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు నాయుడిపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.

చంద్రబాబుపై పలు అభియోగాలు..

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో సీఐడీ అధికారులు చంద్రబాబుపై అనేక అభియోగాలు మోపారు. ప్రభుత్వ నిధులు రూ.371 కోట్ల మేర అవినీతి జరిగిందని, షెల్‌ కంపెనీల ద్వారా రూ. 241 కోట్ల స్కాం చేశారని ఆరోపించారు. కేబినెట్‌ను తప్పుదారి పట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి ప్రభుత్వ సొమ్ము కాజేశారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై ఈడీ, సెబీ..ఇలా ఏజెన్సీలన్నీ కూడా దర్యాప్తు చేశాయి. దోచేసిన సొమ్మును ముందుగా విదేశాలకు అక్కడి నుంచి తిరిగి దేశంలోకి మళ్లించినట్లు సీఐడీ ఆరోపిస్తోంది.

ఇవి కూడా చదవండి

సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో ఏముంది..?

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించిన సీఐడీ నమోదు చేసిన రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక అంశాలున్నాయి. 2015 జూన్‌లో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌లో ఆర్థికలావాదేవీల్లో అవకతవకలు జరిగాయని గుర్తించినట్లు తెలిపింది. జీవో నెంబర్ 4 ప్రకారం సీమెన్స్‌ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్, డిజైన్‌ టెక్‌ ఎండీ వికాస్‌ కన్విల్కర్‌కు గత ప్రభుత్వం రూ.241 కోట్లు కేటాయించిందని తెలిపింది. ఉద్దేశపూర్వకంగా ఈ సొమ్ము అప్పగించిందని వెల్లడించింది. ఈ సొమ్మును 7 షెల్‌ కంపెనీలకు తప్పుడు ఇన్‌వాయిస్‌లు సృష్టించినట్టు తరలించారని సీఐడీ తన రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపింది.

ఈ ప్రాజెక్టు వ్యయాన్ని టెక్నాలజీ కంపెనీలు, ప్రభుత్వానికి విభజించడంలో అవకతవకలు జరిగాయని సీఐడీ తన రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. 2017-18లో రూ.371 కోట్లలలో.. రూ.241 కోట్లు గోల్‌మాల్‌ జరిగాయని సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో వెల్లడించింది. గతంలో సీఐడీ కేసులు నమోదు చేసిన 26 మందికి తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..