Chandrababu: ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులు నష్టపోయారు.. ఏపీ సర్కార్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

|

Dec 14, 2023 | 4:27 PM

రైతులు ఇంత నష్టపోతున్నా ప్రభుత్వ నష్టనివారణ చర్యలు చేపట్టలేకపోయిందని దుయ్యబట్టారు. పంట కాలువలను పదేళ్లుగా బాగు చేయించలేదని, పంట చేలల్లో నీరు దిగువకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీని కారణంగా చేలల్లోనే ధాన్యం మొలకలు వచ్చాయని, ఇది పూర్తిగా ముఖ్యమంత్రి వైఫలమేనని అన్నారు. అహంకారంగా వ్యవహరించి సీఎం రైతులను అప్పుల పాలు చేశాడని మండిపడ్డారు. రైతుల నష్టంపై కూడా తమ బృందం పర్యవేక్షిస్తోందని, ఈ రిపోర్టును..

Chandrababu: ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులు నష్టపోయారు.. ఏపీ సర్కార్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Chandrababu
Follow us on

తుఫాను హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం వైఫల్యం కారణంగా రైతులు నష్టపోతున్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నాలుగు నెలల తర్వాత ఆయన గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తుఫాను కారణంగా రాష్ట్రంలోని 15 జిల్లాల్లో సుమారు 22 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిందని, తుఫాను వస్తుందని తెలిపినా ప్రభుత్వం సక్రమంగా హెచ్చరించలేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను సక్రమంగా పర్యవేక్షించడం లేదన్నారు. అలాగే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే అదే పరిస్థితి నెలకొంటుందని అన్నారు.

రైతులు ఇంత నష్టపోతున్నా ప్రభుత్వ నష్టనివారణ చర్యలు చేపట్టలేకపోయిందని దుయ్యబట్టారు. పంట కాలువలను పదేళ్లుగా బాగు చేయించలేదని, పంట చేలల్లో నీరు దిగువకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీని కారణంగా చేలల్లోనే ధాన్యం మొలకలు వచ్చాయని, ఇది పూర్తిగా ముఖ్యమంత్రి వైఫలమేనని అన్నారు. అహంకారంగా వ్యవహరించి సీఎం రైతులను అప్పుల పాలు చేశాడని మండిపడ్డారు. రైతుల నష్టంపై కూడా తమ బృందం పర్యవేక్షిస్తోందని, ఈ రిపోర్టును కేంద్రానికి నివేదిస్తామన్నారు. తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామన్నారు.

హెక్టారుకు రూ.35 వేల నష్టపరిహారం ఇవ్వాలి

హెక్టారుకు రూ.35 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నామని, నష్టపోయిన రైతులకు ఎంత ఇస్తారో మీకైనా తెలుసా..? చంద్రబాబు ప్రశ్నించారు. తుఫాను నష్టంపై ప్రభుత్వం వైట్‌ పేపర్‌ రిలీజ్‌ చేయాలన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్వాహణకు ఒక్కపైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రైతులకు సరైన నష్టపరిహారం వచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.

వైసీపీ ఇంచార్జీల మార్పుపై జగన్ లెక్కలు టారుమారయ్యాయని, తాడేపల్లి ప్యాలెస్ లో ఓటమి భయం పట్టుకుందని, అందుకే 11 మందిని ముందుగానే మార్చేశారన్నారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు బదిలీలు ఎందుకు ఉంటాయని, ఇక్కడి చెల్లని కాసు…అక్కడ చెల్లుతుందా.? అని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా వైసీపీ ఎమ్మెల్యేలు ఆంబోతులుగా మారి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు. ప్రజలు తిరుగుబాటు చేసేసరికి బదిలీలు చేశారని, ఐదుగురు దళితులను బదిలీ చేశారని ఆరోపించారు. బీసీల మీద ప్రేమ ఉంటే పులివెందుల సీటు బీసీలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జగన్ గొప్పోడు కదా.. ఎక్కడైనా గెలుస్తాడు కదా? అంటూ ఎద్దేవా చేశారు.

తమ పార్టీ అభ్యర్థుల విషయంలో తాను అందరి అభిప్రాయాలు తీసుకుని ఎంపిక చేస్తానని, అందరు సహకరించాలన్నారు. ప్రజాభిప్రాయం తీసుకుని అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. కుప్పంలో కూడా ప్రజాభిప్రాయం తీసుకుంటామని, వైసీపీ నుంచి ఎవరైనా మంచి వాళ్ళు వస్తామని అడిగితే పరిశీలిస్తామన్నారు. అభర్డుల ఎంపిక ఈసారి గతంలో మాదిరిగా ఉండదని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటానని అన్నారు.

దొంగ ఓట్లు ఖచ్చితంగా తొలగించాలి

ఇక రాష్ట్రంలో ఉన్న దొంగ ఓట్లను తప్పకుండా తొలగించాలని డిమాండ్‌ చేశారు. అలాగే విశాఖ వెళ్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారని, రుషికొండ లో కోర్టులు చెప్పినా వినడం లేదని, ఇష్టానుసారంగా కొండలు తవ్వేస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు.. చట్టం ముఖ్యమంత్రి కి వర్తించదా? అంటూ ప్రశ్నించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి