Weather Report: హాట్‌హాట్‌ సమ్మర్‌లో కూల్‌ న్యూస్‌ చెప్పిన వాతావరణ శాఖ.. రెండు రోజులపాటు వర్షాలే వర్షాలు..!

|

May 07, 2022 | 6:10 AM

Weather Report: హాట్‌హాట్‌ సమ్మర్‌లో కూల్‌ న్యూస్‌ చెప్పింది భారత వాతావరణ కేంద్రం. భగభగ మండుతున్న ఎండలతో అల్లాడిపోతున్న...

Weather Report: హాట్‌హాట్‌ సమ్మర్‌లో కూల్‌ న్యూస్‌ చెప్పిన వాతావరణ శాఖ.. రెండు రోజులపాటు వర్షాలే వర్షాలు..!
Ap Weather Alert
Follow us on

Weather Report: హాట్‌హాట్‌ సమ్మర్‌లో కూల్‌ న్యూస్‌ చెప్పింది భారత వాతావరణ కేంద్రం. భగభగ మండుతున్న ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఊరటనిచ్చే న్యూస్‌ చెప్పింది వాతావరణ శాఖ. అవును.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అదే సమయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ బెల్ కూడా మోగించింది ఐఎండీ.

దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వాయువ్య దిశగా కదులుతున్న అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు తమిళనాడు, కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, యానాం ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఒకట్రెండు చోట్ల ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు అధికారులు. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, తీర ప్రాంత ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని సూచించారు. రాయలసీమ జిల్లాలు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు. గడిచిన 24 గంటల్లో రాయలసీమలోని కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 41.6 డిగ్రీలుగా నమోదైంది. రెండు రోజులు వర్షాలు కురవనున్నాయని, తమ ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.