Kandukur Stampede: టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిహారం.. ఎంతంటే..

చంద్రబాబుకు గ్రాండ్‌ వెల్కం చెప్పాలనుకున్న తమ్ముళ్ల అత్యుత్సాహం విషాదంగా పరిణమించింది. తొక్కిసలాటకు ఎనిమిది నిండు ప్రాణాలు బలైపోయాయి. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. పరిహారం కూడా ప్రకటించాయి

Kandukur Stampede: టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిహారం.. ఎంతంటే..
Central And Ap Govt Announce Ex Gratia On Kandukuri Stampede

Updated on: Dec 29, 2022 | 12:21 PM

కందుకూరు తొక్కిసలాట ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడ్డవారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. కందుకూరు దుర్ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. కందుకూరు ప్రమాదంపై తీవ్రంగా కలత చెందాను అని అన్నారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50 వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.

ఇదిలా ఉంటే, టీడీపీ అధినేత చంద్రబాబు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా కందుకూరులో బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్‌ షో పెను విషాదాన్ని మిగిల్చింది. రోడ్‌ షో జరిగిన ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇదిలావుంటే, కందుకూరు దుర్ఘటన 8 కుటుంబాల్లో విషాదం నింపింది. తొక్కిసలాట 8 కుటుంబాలను రోడ్డున పడేసింది. ఆయా కుటుంబాలిప్పుడు బోరున విలపిస్తున్నాయి. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధితులు కొందరైతే కుటుంబ సభ్యులను కోల్పోయి రోదిస్తున్నారు మరికొందరు. నిర్లక్ష్యమా? సరైన భద్రత లేకపోవడమా? ఇరుకు సందులో సమావేశం ఏర్పాటు చేయడమా? కారణం ఏదైతేనేం.. 8 కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం