Vivekananda Reddy Murder Case: ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రోజురోజుకు సంచనల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో సీబీఐ విచారణ వేగంగా కొనసాగుతోంది. విచారణ చేపట్టినకొద్ది రోజుకో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అసలైన నిందితులు బయటకు వస్తున్నారు. ఈ వ్యవహారంలో కస్టడీలో ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. నిన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సీబీఐ అధికారులు.. లోతుగా విచారిస్తున్నారు. అయితే దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతించింది పులివెందుల కోర్టు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకోని హత్య కుట్ర కోణంపై సీబీఐ ఆరా తీస్తోంది. దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్న కీలక వ్యక్తులను కూడా విచారించే అవకాశం ఉంది. వీరికి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం.
ఇప్పటికే ఎంతో మంది నిందితులను అదుపులోకి తీసుకోని తమదైన శైలిలో విచారిస్తోంది సీబీఐ. వివేకానందరెడ్డి 2019 మార్చి 14న అర్ధరాత్రి తన ఇంట్లో హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసు అనుమానితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: