CBI ex JD Lakshmi Narayana: కౌలు రైతుగా మారిన సీబీఐ మాజీ జేడీ.. 10 ఎకరాల భూమిని బాడిగకు తీసుకుని వ్యవసాయం

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కౌలు రైతయ్యారు. ఏపీలో కౌలు రైతుల స్థితిగతులు తెలుసుకునేందుకు స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. మెట్టప్రాంతంలో...

CBI ex JD Lakshmi Narayana: కౌలు రైతుగా మారిన సీబీఐ మాజీ జేడీ.. 10 ఎకరాల భూమిని బాడిగకు తీసుకుని వ్యవసాయం
Ex Jd Lakshmi Narayana

Updated on: Apr 15, 2021 | 8:01 AM

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కౌలు రైతయ్యారు. ఏపీలో కౌలు రైతుల స్థితిగతులు తెలుసుకునేందుకు స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. మెట్ట ప్రాంతంలో స్వయంగా తానే కౌలుకు వ్యవసాయం చేసేందుకు గానూ, పొలం బాటపట్టారు. తూర్పు గోదావరి జిల్లా ధర్మవరం గ్రామానికి చెందిన ఓ రైతు దగ్గర 10 భూమిని కౌలుకు తీసుకొని ఏరువాక సాగించారు. కౌలుకు తీసుకున్న భూమిలో ట్రాక్టర్‌తో తానే స్వయంగా దుక్కి దున్నారు. తాను ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి కౌలు రైతులు, యువతుల సమస్యలపై దృష్టి సారించానని జేడీ చెప్పారు. ప్రభుత్వాలు ఎన్ని రాయితీలు ఇస్తున్నా..అవి రైతులకే గానీ, కౌలు రైతులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు ప్రత్తిపాడు మండలం అరుణాచలం ఆలయాన్ని సందర్శించారు.

గతంలో కూడా లక్ష్మీ నారాయణ రైతు సమస్యలపై అధ్యయనం చేశారు.. వాటి పరిష్కారంపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన పొలాన్ని కౌలుకు తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. గతంలో జనసేన పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత లక్ష్మీ నారాయణ సొంతం పార్టీ పెడతారని విసృతంగా ప్రచారం జరిగింది. కానీ ఎందుకో ఆ దిశగా అడుగులు మాత్రం ముందుకు పడలేదు.

Also Read:  ‘మందగా ఉంటే ఆ బలమే వేరప్పా’… సింహాన్ని చీల్చి చెండాడిన గేదెలు.. స్పాట్ డెత్

తూర్పుగోదావరి జిల్లా మానేపల్లిలో సక్కర్ ఫిష్ కలకలం.. తోటి చేపల్ని, జీవుల్నీ ఇది మింగేస్తుంది