Ambati Rambabu: ‘నేను భయపడాలా..?’ కేసుపై అంబటి రాంబాబు స్పందన ఇదే

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిన్న(బుధవారం) వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసనల్లో భాగంగా తనను అడ్డుకున్న పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ లుక్కేయండి.

Ambati Rambabu: నేను భయపడాలా..? కేసుపై అంబటి రాంబాబు స్పందన ఇదే
Ambati Rambabu

Updated on: Jun 05, 2025 | 1:06 PM

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిన్న(బుధవారం) వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసనల్లో భాగంగా తనను అడ్డుకున్న పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురం పీఎస్‌లో అంబటిపై కేసు నమోదు చేశారు గుంటూరు పోలీసులు. దీనిపై తాజాగా అంబటి రాంబాబు స్పందించారు. ‘కాపుల మీదే కేసులు తిరగతోడాలనుకునే వారు.. నా మీద కేసులు పెట్టకుండా ఉంటారా.? కేసులకు నేను భయపడాలా.?’ అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్‌లో అంబటి రాంబాబు పేర్కొన్నారు.