AP: లారీకి యాక్సిడెంట్.. గోనె సంచుల కట్టల మధ్యలో తెల్లటి సంచులు.. అనుమానంతో చెక్ చేయగా..

|

Apr 19, 2022 | 9:43 AM

పోలీసులకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. రోడ్డపై వెళ్లే ప్రతి వాహనాన్ని అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా పైపైన చెక్ చేస్తే సరిపోవడం లేదు.

AP: లారీకి యాక్సిడెంట్.. గోనె సంచుల కట్టల మధ్యలో తెల్లటి సంచులు.. అనుమానంతో చెక్ చేయగా..
Truck Accident
Follow us on

పోలీసులకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. రోడ్డపై వెళ్లే ప్రతి వాహనాన్ని అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా పైపైన చెక్ చేస్తే సరిపోవడం లేదు. క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన కాలం దాపరించింది.. అవును మరి.. ఎవరు.. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారో తెలీదు.. ఎవరు మన ఎర్ర చందనం దోచుకెళ్తున్నారో తెలీదు.. ఎవరు వన్య ప్రాణులను తరలిస్తున్నారో తెలీదు. స్మగ్లర్ల కొత్త, కొత్త ఐడియాలు చూసి.. పోలీసులు సైతం నిర్ఘాంతపోవాల్సిన పరిస్థితి. తాజాగా అనకాపల్లి జిల్లా(anakapalle district)లోని గొబ్బూరు వద్ద డీఆర్‌ఐ అధికారులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రూ.2.33 కోట్లు విలువైన 1,169.3 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh) రిజిస్ట్రేషన్‌ ఉన్న టాటా ట్రక్‌ వైజాగ్ నుంచి హైదరాబాద్‌(Hyderabad) వైపు వెళ్తోంది. అనకాపల్లి జిల్లా గొబ్బూరు వద్ద.. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదానికి గురైంది. అందులో పాత గోనె సంచుల మధ్య తెల్లగా ఉన్న ఇంకొన్ని సంచులు బయటపడ్డాయి.

స్థానికులకు కాస్త తేడా కొట్టడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న డీఆర్‌ఐ అధికారులు సంఘటనా స్థలానికి పరిశీలించగా.. ఆ సంచుల లోపల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఖాళీ గోనె సంచుల మాటున గంజాయి తరలిస్తున్నట్లు విశాఖపట్నం ప్రాంతీయ డీఆర్‌ఐ అధికారులు వివరించారు. దీంతో కేసు నమోదు చేసి.. గంజాయితోపాటు ట్రక్‌ను సీజ్‌ చేశారు.  పరారైన నిందితుల కోసం డీఆర్‌ఐ అధికారులు గాలిస్తున్నారు.

Also Read: Andhra: ఏపీలో అన్ని చోట్లా ఆర్టీసీ ఛార్జీలు పెరిగితే.. అక్కడ మాత్రం రూ.10 తగ్గాయి.. ట్విస్ట్ ఏంటంటే..?