Cannabis Smugglers: విశాఖ ఏజన్సీలో కాల్పులు.. రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు.. కాల్పులు జరిపిన పోలీసులు..!

|

Oct 17, 2021 | 7:43 PM

Cannabis Smugglers: ప్రకృతి అందాలు.. మంచు దుప్పటితో సహజ అందాలను కలిగిన.. లంబసింగి మన్యంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. స్మగ్లర్లు తెగబడ్డారు...

Cannabis Smugglers: విశాఖ ఏజన్సీలో కాల్పులు.. రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు.. కాల్పులు జరిపిన పోలీసులు..!
Follow us on

Cannabis Smugglers: ప్రకృతి అందాలు.. మంచు దుప్పటితో సహజ అందాలను కలిగిన.. లంబసింగి మన్యంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. స్మగ్లర్లు తెగబడ్డారు. గాల్లోకి రాళ్లు రువ్వారు. ఏకంగా పోలీసులకే ఎదుగు తిరిగారు. చివరకు తుపాకులు గర్జించాయి. విశాఖ ఏజెన్సీలో గంజా స్మగ్లర్ల హద్దు మీరి ప్రవర్తించడం కాదు.. ఏకంగా పోలీసులపైనే దాడి చేశారు. గంజాయి స్మగ్లర్లను వెంటాడుతూ.. ఆ ప్రాంతానికి వచ్చిన నల్గొండ టాస్క్ ఫోర్స్ పోలీసులపై రాళ్ళ దాడితో తీవ్ర ప్రతి ఘటన ఎదురైంది. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయి. దాడి నుంచి తప్పించుకువడానికి నల్గొండ పోలీసులు.. ఫైర్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఏకంగా 10 రౌండ్ల వరకు కాల్పులు జరిగాయి. లంబ సింగి ఘాట్ రోడ్ లో డౌనూరు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలం నుంచి స్మగ్లర్లు చాకచక్యంగా తప్పించుకున్నారు. వాళ్ల కోసం వేట కొనసాగుతోంది.

అయితే స్మగ్లర్లు పోలీసులపై ఎదురు దాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం గాల్లో కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు. పోలీసులు కాల్పులు జరపడంతో స్మగ్లర్లు పారిపోయారు. ఇద్దరికి బుల్లెట్‌ గాయాలు అయ్యాయి. బాధితులు గ్రామస్తులు రాంబాబు, కామరాజుగా గుర్తించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

కాగా, ఈ మధ్యకాలంలో గంజాయి స్మగ్లర్ల అగడాలు మరింతగా పెరిగిపోయాయి. పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా గంజాయిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గంజాయి స్మగ్లింగ్‌ లేకుండా పోలీసులు అనునిత్యం తనిఖీలు చేపడుతూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో గంజాయి వనాలను పోలీసులు తగులబెట్టారు. అయినా ఇంకా గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు.. గంజాయి ముఠాలను పట్టుకుంటున్నారు.

ఇవీ కూడా చదవండి:

Vizag: వేగంగా దూసుకొచ్చిన కారు.. అనుమానం వచ్చి చెక్ చేసిన పోలీసులు.. షాక్

Andhra Pradesh: వాహనాలకు ఫేక్ స్టిక్కర్లు వేస్తున్నారా..? అయితే మీరు బుక్ అయినట్లే