Andhra Pradesh: తహశీల్దార్ కార్యాలయ సిబ్బందికి ఝలక్.. ఆఫీస్‌కి తాళం వేసిన వ్యక్తి.. ఇంతకీ ఏం జరిగిందంటే..!

Andhra Pradesh: ఇన్నాళ్లూ అద్దె భవనంలోనే నడిచింది ఎమ్మార్వో కార్యాలయం. ప్రభుత్వం కొత్త బిల్డింగ్‌ నిర్మించడంతో రాత్రికి రాత్రే చెక్కేయాలనుకున్నారు

Andhra Pradesh: తహశీల్దార్ కార్యాలయ సిబ్బందికి ఝలక్.. ఆఫీస్‌కి తాళం వేసిన వ్యక్తి.. ఇంతకీ ఏం జరిగిందంటే..!
Lock

Edited By:

Updated on: Jun 18, 2022 | 6:22 AM

Andhra Pradesh: ఇన్నాళ్లూ అద్దె భవనంలోనే నడిచింది ఎమ్మార్వో కార్యాలయం. ప్రభుత్వం కొత్త బిల్డింగ్‌ నిర్మించడంతో రాత్రికి రాత్రే చెక్కేయాలనుకున్నారు రెవెన్యూ ఉద్యోగులు. కానీ, అద్దె చెల్లించకుండా ఒక్క పేపర్‌ను కూడా తీసుకెళ్లనివ్వనంటూ ఎమ్మార్వో ఆఫీస్‌కి తాళం వేశాడు బిల్డింగ్‌ ఓనర్‌. వివరాల్లోకెళితే.. నంద్యాల జల్లా పాములపాడు ఎమ్మార్వో ఆఫీస్‌కి తాళం పడింది. అద్దె చెల్లించలేదంటూ కార్యాలయానికి తాళం వేశాడు బిల్డింగ్‌ ఓనర్‌. దాంతో, వివిధ పనులతో పాములపాడు తహశీల్దార్‌ ఆఫీస్‌కి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎమ్మార్వో కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో ఏం జరిగిదో తెలియక, గంటల తరబడి గేటు ముందే పడిగాపులు పడ్డారు జనం. ఆఫీస్‌ సిబ్బంది ఇంకా రాలేదేమో, అందుకే గేట్ తీయలేదనుకుని భావించారు. గంటలతరబడి నిరీక్షించి, విసిగిపోయి అక్కడ్నుంచి వెళ్లిపోయారు ప్రజలు. అయితే, ప్రజలతోపాటు ఉద్యోగులు కూడా బయటే పడిగాపులు పడి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.

పాములపాడు ఎమ్మార్వో కార్యాలయంలో అద్దె భవనంలో నడుస్తోంది. అయితే, ప్రభుత్వం కొత్త బిల్డింగ్‌ నిర్మించడంతో తనకు అద్దె చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నానరి అంటున్నాడు బిల్డింగ్‌ ఓవనర్‌ ప్రశాంత్‌. గత నాలుగేళ్లుగా అద్దె చెల్లించలేదని, తనకు 3లోల 65వేల 868 రూపాయలు చెల్లించాల్సి ఉందని చెబుతున్నాడు. తనకు వెంటనే అద్దె చెల్లించాలని, అప్పటివరకు తాళం తీసేదే లేదని అంటున్నాడు. అంతేకాదు, అద్దె చెల్లించకపోతే, ఒక్క డాక్యుమెంట్‌ను అక్కడ్నుంచి తీసుకెళ్లనివ్వనని హెచ్చరిస్తున్నాడు.