West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థి విశ్వేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్క్ ఫ్రం హోంలో సకాలంలో పని పూర్తి కాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన విశ్వేశ్వరరావు ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, విలియం టెక్ కంపెనీ.. వర్క్ ఫ్రం హోంలో సకాలంలో పని పూర్తి చేయకపోవడంతో.. బాధితుడి నుంచి నష్ట పరిహారం కోరింది కంపెనీ. డబ్బు చెల్లించాలని తీవ్ర ఒత్తిడి చేసింది. దీంతో ఆందోళనకు గురైన విశ్వేశ్వరరావు.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఇదిలాఉంటే.. వర్క్ ఫ్రం హోం రోజుల్లో యువకులతో ఫేక్ కంపెనీలు చెలగాటం ఆడుతున్నాయి. విశ్వేశ్వరరావు ఆత్మహత్య కేసులో గుజరాత్‌కు చెందిన నకిలీ కంపెనీ వ్యవహారం బట్టబయలు అయ్యింది. గుజరాత్‌కు చెందిన విలియం టెక్ కంపేనీ.. ఆన్‌లైన్ వర్క్ ద్వారా లక్షలు సంపాదించమంటూ ప్రకటన విడుదల చేసింది. అది నమ్మిన పెనుగొండకు చెందిన బీటెక్ విద్యార్థి విశ్వేశ్వరరావు(21).. 14 వేల జీతంలో ఆన్‌లైన్‌లో వర్క్ చేశాడు. అయితే, నెల రోజుల తరువాత శాలరీ అడగటంతో అసలు బుద్ధి బయటపెట్టుకుంది కంపెనీ. చేసిన వర్క్‌లో తప్పులున్నాయని నష్ట పరిహారం కోరింది సంస్థ. దాంతో విశ్వేశ్వరరావు రూ. 5 వేలు చెల్లించాడు. అయినప్పటికీ ఇంకా డబ్బు డిమాండ్ చేయటంతో.. తీవ్ర ఓత్తిడికి గురయ్యాడు విశ్వేశ్వరరావు. ఈ క్రమంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, విశ్వేశ్వరరావు పని చేసిన విలియం టెక్ కంపెనీ నకిలీదిగా గుర్తించారు పోలీసులు. సదరు కంపెనీ నిర్వాహకులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. కంపెనీ నిర్వాహకుల ఒత్తిడి వల్లే విశ్వేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నట్లుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Also read:
West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో విషాదం.. ఓ కంపెనీ నిర్వాకంతో యువకుడు ఆత్మహత్య..
Dengue strains: డెంగ్యూ కొత్త మ్యూటెంట్.. దాదాపు 11 రాష్ట్రాల్లో న్యూ వేరియంట్ కల్లోలం
అరటి పండ్లు కొంటున్నారా జాగ్రత్త..! అవి కార్బైడ్ వేసి పండించారా.. లేదా సహజంగా పండించారా..?