Andhra Crime: హత్య చేసి.. అడవిలో దంపతుల మకాం.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..?

వాళ్ళిద్దరూ స్నేహితులు.. ఏజెన్సీలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే డబ్బు అవసరం వచ్చి స్నేహితుడి నుంచి డబ్బు తీసుకున్న మరో స్నేహితుడు. అయితే తీసుకున్న అప్పు తిరిగివ్వాలసి సదురు స్నేహితుడు తడడంతో అప్పు తీసుకున్న వ్యక్తికి ఆగ్రహం పుట్టుకొచ్చింది. అప్పు ఇచ్చిన వ్యక్తిని హత్య చేస్తే.. తీసుకున్న డబ్బు చెల్లించే పనిలేదనుకొని.. భార్యతో కలిసి స్నేహితుడిని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఓ ఇంట్లో వేసి ఇంటికి నిప్పంటించారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అనంతరం అక్కడి నుంచి అడవిలోకి పారిపోయారు.

Andhra Crime: హత్య చేసి.. అడవిలో దంపతుల మకాం.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..?
Andhra Crime

Edited By:

Updated on: Jan 31, 2026 | 5:34 PM

పాడేరు ఏజెన్సీలోని.. ఓ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పోలీసులను కలవర పెట్టింది. ఎందుకంటే ఓ ఇంట్లో ఓ వ్యక్తి దహనం అయ్యాడు. ఈ ఘటన ఈనెల 23న పాడేరు మండలం చింతలపాలెంలో జరిగింది. రామన్న అనే 73 ఏళ్ళ వృద్ధుడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ పాక ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అతనికి వంతల సోమన్న అనే వ్యక్తితో కొన్నాళ్లుగా స్నేహం ఉంది. గతంలో తన వ్యక్తిగత అవసరాల కోసం 5600 రూపాయలను రామన్న నుంచి సోమన్న తీసుకున్నాడు. అయితే పది రోజుల క్రితం సోమన్న తన భార్య దేవితో కలిసి రామన్న దగ్గరికి వెళ్లారు. రామన్న దగ్గర జీలిగ కళ్ళు ఉండడంతో దాన్ని తాగినందుకు దంపతులిద్దరూ చింతలపాలెం కు వెళ్లి రామన్నను పలకరించారు. అయితే గతంలో తీసుకున్న అప్పు చెల్లించాలని రామన్న సోమన్నను కోరాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. రామన్నను చంపేస్తే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని సోమన్న భార్య పథకం వేసింది. ఈనెల 23న ఇద్దరు కలిసి రామన్న దగ్గరికి వెళ్లారు. ముందుగా రామన్న కొడుకు చిన్న బాబును సోమన్న తన వద్ద ఉన్న కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో చిన్నబాబు పరుగులు తీశాడు.

ప్రమాద మరణంగా చిత్రీకరించేలా సజీవ దహనం

జీలుగా చెట్టు వద్ద ఉన్న రామన్న తన కొడుకు పరుగులు పెడుతుండడం చూసి ఆపాడు.. తన కొడుకును ఎందుకు కొడుతున్నావ్ అంటూ సోమన్నను నిలదీసాడు రామన్న. దీంతో రామన్న పై విచక్షణ రహితంగా దాడి చేశాడు సోమన్న. దీంతో రామన్న అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అయితే హత్య కేసు తమపై రాకుండా ఉండేందుకు ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు సోమన్న దంపతులు. గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన రామన్నను తీసుకెళ్లి అక్కడే ఉన్న అతని పాక ఇంట్లో పడేశారు. అనంతరం ఇంటికి నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో రామన్న ప్రాణం ఉండగానే మంటల్లో సజీవ దహనమై ఊపిరి వదిలాడు.

నిందితులను పట్టించిన డ్రోన్

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే చంచలపాలెం గ్రామానికి చేరుకుని రామన్న తాటి ఇంటిని పరిశీలించారు. నిందితుల అడవిలోకి పారిపోయారనే సమాచారంతో వారి కోసం అడవుల్లో డ్రోన్ల సహాయంతో గాలించారు. నిందితులు రెండు మూడు రోజులపాటు ఆహారం లేక అడవుల్లోనే ఉండిపోయారు. ఎట్టకేలకు డ్రోన్ కెమెరాలకు చిక్కిపోయారు. గాల్లో డ్రోన్లు ఎగరడం గమనించిన ఇద్దరు నిందితులు దాన్ని నుంచి తప్పించుకునేందుకు పొదల్లోకి పారిపోయారు. కానీ అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.