Krishna District: చనిపోయిన పెంపుడు కుక్కకు కాంస్య విగ్రహం, ఐదేళ్లగా వర్థంతి కార్యక్రమాలు

|

Jul 22, 2021 | 5:28 PM

ప్రస్తుత సమాజంలో ఎవరైనా మరణిస్తే.. కొంతకాలానికి రక్త సంబంధికులే మర్చిపోతున్నారు. అలాంటిది... చాలా సంవత్సరాలు తమ ఇంట్లో పెంచుకున్న కుక్క...

Krishna District: చనిపోయిన పెంపుడు కుక్కకు కాంస్య విగ్రహం, ఐదేళ్లగా వర్థంతి కార్యక్రమాలు
Bronze Statue To pet dog
Follow us on

ప్రస్తుత సమాజంలో ఎవరైనా మరణిస్తే.. కొంతకాలానికి రక్త సంబంధికులే మర్చిపోతున్నారు. అలాంటిది… చాలా సంవత్సరాలు తమ ఇంట్లో పెంచుకున్న కుక్క చనిపోతే, దాని జ్ఞాపకాలు మరువలేని ఓ వ్యక్తి దానికి 5 ఏళ్ల నుంచి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ తన ప్రేమ చాటుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురంకు చెందిన సుంకర జ్ఞానప్రకాశరావు అనే వ్యక్తి తన ఇంట్లో చాలా సంవత్సరాల నుండి పెంచుకున్న కుక్క అనుకోకుండా మరణించింది. అయితే పెట్ డాగ్ అయినప్పటికీ దానికి  సునకరాజు అనే పేరు పెట్టి ఇంట్లో మనిషిలా దానితో అనుబంధం పెంచుకున్నారు జ్ఞానప్రకాశరావు కుటుంబ సభ్యులు. గత 5 ఏళ్ల క్రితం ఇదే రోజు వారి పెంపుడు కుక్క సునకరాజు మరణించింది. ఆ బాధను తట్టుకోలేకపోయిన ఆ కుటుంబం విలవిల్లాడింది. సునకరాజు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం దానికి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.

5వ వర్ధంతి సందర్భంగా సునకరాజు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి, శాస్త్రీయ బద్దంగా కుక్క ఆత్మకు శాంతి కలగాలని పండితుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత స్థానికులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఎక్కువ రోజులు తమ కుటుంబంతో కలిసి జీవించిన సునకరాజు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చూపరులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రజంట్ అయినవారు చనిపోతే డెడ్‌బాడీని ఆఖరి చూపు చూసేందుకు కూడా కనీసం జనాలు రావడం లేదు. అలాంటిది చనిపోయిన పెంపుడు కుక్కపై ఇంత ప్రేమ ప్రదర్శించడం నిజంగా చిత్రంగా ఉంది.

Also Read: కర్నూలు జిల్లాలో పాల వ్యాను బోల్తా.. జనాలు చూడండి ఎలా ఎగబడి వచ్చారో

Telangana Rains: వానొచ్చె, వరదలు తెచ్చె.. రోడ్లపైనే చేపల వేట.. ఒక్కోటి కిలోకు పైనే