Internet Services: కోనసీమ జిల్లాలో ఇంటర్నెట్‌ సేవలకు బ్రేక్‌.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, విద్యార్థులు

|

May 28, 2022 | 8:00 AM

Internet Services: కోనసీమ జిల్లాలో ఇంటర్నెట్‌ సేవలకు బ్రేక్‌ వేశారు పోలీసులు. దీంతో సెల్‌ఫోన్‌లు, లాప్‌ట్యాప్‌లు పట్టుకొని నానా అవస్థలు పడుతున్నారు ప్రజలు. కోనసీమ..

Internet Services: కోనసీమ జిల్లాలో ఇంటర్నెట్‌ సేవలకు బ్రేక్‌.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, విద్యార్థులు
Follow us on

Internet Services: కోనసీమ జిల్లాలో ఇంటర్నెట్‌ సేవలకు బ్రేక్‌ వేశారు పోలీసులు. దీంతో సెల్‌ఫోన్‌లు, లాప్‌ట్యాప్‌లు పట్టుకొని నానా అవస్థలు పడుతున్నారు ప్రజలు. కోనసీమ జిల్లా పేరుమార్పుపై చెలరేగిన హింసతో, ప్రభుత్వం అక్కడ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది. నాలుగు రోజులుగా ఇంటర్నెట్‌ సేవలు ఆగిపోవడంతో వర్క్‌ ఫ్రంహోం ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెట్‌వర్క్‌ కోసం జిల్లా సరిహద్దులు దాటి, ల్యాప్‌టాప్‌లతో వెళ్లి వర్క్‌ చేసుకుంటున్నారు. ఇంటర్నెట్‌ లేక ఇబ్బంది అవుతోందని, నెట్‌వర్క్‌ను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

అటు, కోనసీమ జిల్లాలో పోలీసుల భారీ బందోబస్తు కొనసాగుతోంది. అమలాపురం పట్టణం పూర్తిగా అష్టదిగ్భందంలోకి వెళ్లిపోయింది. పోలీస్ పికెట్లు, భారీ గస్తీ ఏర్పాటు చేశారు. అక్కడే మకాం వేసి పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఏలూరు డీఐజీ పాలరాజు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా, పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బయటవారు అమలాపురంలోకి రాకుండా ఆంక్షలు విధించారు. అటు నెట్‌వర్క్‌ లేక ప్రభుత్వ కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. వాలంటీర్లు కూడా జిల్లా సరిహద్దులకు వచ్చి పనిచేస్తున్నారు. ఇంటర్నెట్‌ను పునరుద్ధరిస్తే, పనులు సులువుగా అవుతాయని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి