Nandyala: చెరుకు రసం తీసే మిషన్‌లో చేయి పెట్టిన బాలుడు.. ఆ తర్వాత

|

Apr 23, 2023 | 12:46 PM

చిన్న వయస్సులో పిల్లలు తుత్తర పనులు చేస్తుంటారు. అవి ఎంత పెద్ద ప్రమాదాన్ని తీసుకువస్తాయో వారు కనీసం ఊహించలేరు. అందుకే పేరెంట్స్ వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించి అయినా వారిని హద్దల్లో ఉంచాలి.

Nandyala: చెరుకు రసం తీసే మిషన్‌లో చేయి పెట్టిన బాలుడు.. ఆ తర్వాత
Boy Hand Struct
Follow us on

పాపం పసిపిల్లాడు.. ప్రమాదంపై గుర్తెరగలేదు. అందులో చేయి పెట్టడం డేంజర్ అని తెలియదు. ఆడుకుంటూ.. ఆడుకుంటూ వెళ్లి చెరుకు రసం మిషన్‌లో చేయిపెట్టాడు. కాసేపు అలా విలవిలలాడిపోయాడు. మిషన్‌లో చేయి ఇరుక్కుపోయింది. బయటకు లాగితే వచ్చే పరిస్థితి లేదు. ఈ లోగా బిడ్డడు బాధతో.. కన్నీళ్లు పెడుతూ ఉండిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు రాడ్ల సాయంతో బాబును ప్రమాదం నుంచి బయటపడేశారు.

నంద్యాల జిల్లా డోన్‌లో జరిగిన ప్రమాదం ఇది.. ఆడుకుంటూ చెరుకు మిషన్‌లో చేయిపెట్టాడు ఈ బాలుడు. కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న చెరుకు మిషన్‌లో ఏడేళ్ల జాషువా చెయ్యి ఇరుక్కుపోయింది. రాడ్లతో తొలగించి బాలుడిని రక్షించారు స్థానికులు. బాలుడి చేయికి తీవ్ర గాయాలయ్యాయి.

సో.. అటెన్షన్ పేరెంట్స్. పిల్లలు ప్రమాదాన్ని గుర్తెరగరు. ఏ ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియదు. పిల్లల కేరింగ్ చాలా ముఖ్యం. నిర్లక్ష్యంగా ఉంటే.. పెను ప్రమాదాలు వాటిల్లుతాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..