Badvel Elections: త్వరలోనే సీఎం వైఎస్ జగన్‌కు చెక్ పెడతాం.. బీజేపీ నేత సెన్షేషనల్ కామెంట్స్..

|

Oct 20, 2021 | 12:14 AM

Andhra Pradesh: దళితులను తాను ఏనాడూ అగౌరవ పరిచలేదని, వాస్తవాలను వక్రీకరించడంలో వైసీపీ ఎమ్మెల్యేలు సిద్దహస్తులు అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు.

Badvel Elections: త్వరలోనే సీఎం వైఎస్ జగన్‌కు చెక్ పెడతాం.. బీజేపీ నేత సెన్షేషనల్ కామెంట్స్..
Adi Narayana Reddy
Follow us on

Andhra Pradesh: దళితులను తాను ఏనాడూ అగౌరవ పరిచలేదని, వాస్తవాలను వక్రీకరించడంలో వైసీపీ ఎమ్మెల్యేలు సిద్దహస్తులు అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే భారీ మూల్యం చెల్లిచుకోక తప్పదని హెచ్చరించారు. ఇవాళ బద్వేల్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆదినారాయణ రెడ్డి.. ‘‘కొంచెమైనా ధర్మం ఉండాలి.. శుభ్రత పాటిస్తే ఆరోగ్యవంతంగా ఉంటారని వైద్యులు పదే పదే చెబుతున్న మాట. అయితే దళితవాడల్లో శుభ్రత పాటించడం లేదు. దళితుల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించే క్రమంలో గతంలో వాళ్ళల్లో మార్పు రావాలని కోరా. కానీ ఆ మాటలను వక్రీకరించి కోత్త బాష్యం చెప్పారు వైసీపీ నేతలు.’’ అంటూ వైసీపీ నేతల తీరుపై ఫైర్ అయ్యారు. మోసాలు బట్టబయలు అవుతాయనే మున్సిపల్ చైర్మైన్ రాజగోపాల్ రెడ్డిని పక్కన బెట్టారని విమర్శించారు. వైఎస్ వివేకా హత్య జరిగితే కుట్లు ఎందుకు వేశారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు పన్నుతున్న కుట్రలు కుతంత్రాలు బయటపెట్టే సరైన వ్యక్తిని తానేనని, అందుకే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీకి ఓటేయకపోతే రాయితీలు, పథకాలను కట్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించిన ఆయన.. దమ్ముంటే ప్రజాస్వామ్య పద్దతిలో ఓట్లు అడిగి గెలవగలరా? అని ప్రశ్నించారు.

భూకబ్జాలు, పేదల ఇళ్ళను కబ్జా చేస్తున్నదెవరో బద్వేల్ ప్రజలకు తెలుసునని అన్నారు. వైసీపీ పాలనంతా అవినీతిమయం అని విమర్శలు గుప్పించారు. నల్లమల్ల లంకమల్ల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దోచుకోమంటూ ఎమ్మెల్యేలకు సూచనలు ఇస్తున్నారని, ఇదేనా పాలన అంటే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఉన్నది ప్రధాని మోదీ ప్రభుత్వం అని, ఆయన ముందు జగన్ ఆటలు సాగవని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ అవినీతిపై కరపత్రాలు పంచుతామని, కర్రపెత్తనం తగ్గిస్తామని పేర్కొన్నారు. జగన్ పై 11 సీబీఐ, 7 ఈడి కేసులు ఉన్నాయని, పైగా వైఎస్ వివేకా ను పోట్టన బెట్టుకున్నారని ఆరోపించారు. త్వరలోనే వైఎస్ జగన్ కు చెక్ పెడతామని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పద్దతుల్లో ఎన్నికలు జరుగుతుంటే ఎందుకు ఇంత మంది బద్వేల్ కు వస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల కోసం ప్రధాని మోదీ స్కీమ్ లు అమలు చేస్తుంటే.. జగన్ స్కామ్ లు చేస్తున్నారని దుయ్యబట్టారు. తాను నివసించేది దళిత వాడల్లోనే అని, ఒకసారి దళిత వాడలను సందర్శించి అభివృద్ధి చూడాలంటూ వైసీపీ ప్రభుత్వానికి ఆయన హితవు చెప్పారు.

Also read:

Telangana Crime: ‘ఇంద్ర’ మూవీ సీన్‌ను తలదన్నేలా ఘరనా మోసం.. విషయం తెలిసి షాక్ అయిన పోలీసులు..

సరదాకి సముద్రంలో వల వేశాడు.. బరువుగా అనిపించి లాగాడు.. ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు..

Bangladesh: హిందువులపై దాడులు జరుగుతుంటే.. బంగ్లా ప్రధాని ఫ్లూట్ వాయిస్తున్నారు..రచయిత్రి తస్లీమా నస్రీమ్ ఘాటు వ్యాఖ్యలు