Ramatheertham Temple Incident: రామతీర్థం జంక్షన్ వద్ద బీజేపీ నేత సోము వీర్రాజు అరెస్ట్..

|

Jan 05, 2021 | 11:41 AM

Ramatheertham Temple Incident: బీజేపీ చలో రామతీర్థం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చలో రామతీర్థం పిలుపులో

Ramatheertham Temple Incident: రామతీర్థం జంక్షన్ వద్ద బీజేపీ నేత సోము వీర్రాజు అరెస్ట్..
Follow us on

Ramatheertham Temple Incident: బీజేపీ చలో రామతీర్థం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చలో రామతీర్థం పిలుపులో భాగంగా రామతీర్థం వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసుల చర్యను సోము వీర్రాజు ప్రతిఘటించారు. దాంతో నెల్లిమర్ల రామతీర్థం జంక్షణ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ముఖ్యనేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రామతీర్థంలో సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఎవరూ అక్కడికి వెళ్లడానికి వీల్లేందంటూ 151 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో పలువురు నాయకులను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఇంటి ముందు పెద్ద ఎత్తున పోలీసులు పహారా కాస్తున్నారు. బీజేపీ కార్యాలయం నుంచి రామతీర్థానికి బయలుదేరేందుకు సీఎం రమేష్, కామినేని శ్రీనివాస్ సిద్ధమవగా పోలీసులు అడ్డుకున్నారు. రామతీర్థం వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇదిలాఉంటే ఇప్పటికే పలువురు బీజేపీ నాయకులు గుట్టుగా రామతీర్థం బయలుదేరారు.

Also read:

Ayurvedic Bandage: ఆయుర్వేదంలో మరో కీలక పరిణామం.. గాయాలను మార్పేందుకు ప్రత్యేకంగా..

PM Modi To Inaugurate: కొచ్చి – మంగళూరు గ్యాస్ పైప్‌లైన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ…