ఏపీ బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. కేంద్రమంత్రి నితిష్ గడ్కరీపై చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఎవరూ ఊహించని కామెంట్స్‌తో పొలిటికల్ హీట్ క్రియేట్ చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాయలసీమ ద్రోహి అని అన్నారు. ఆయన రాయలసీమకు ఏమి చేయలేదని విమర్శించారు. ఈ కామెంట్స్ ఏపీ బీజేపీలో ప్రకంపనలు సృష్టించాయి.
ఇక తాజాగా కడప జిల్లాలోని పొద్దుటూరులో జరిగిన పార్టీ సమావేశంలోపాల్గొన్న అధ్యక్షురాలు పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె.. బైరెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తమ పార్టీలో లేరని అన్నారు. ఆయన కూతరు శబరి మాత్రమే తమ పార్టీలో ఉన్నారని అన్నారు. ‘బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయలసీమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఆయనకు ఏమైనా ఇబ్బంది ఉంటే నేరుగా గడ్కరీ వద్దకు వెళ్లి వినతి పత్రం ఇవ్వవచ్చు. అయినా, ఇప్పుడు ఆయన మా పార్టీ కాదు. ఆయన కుమార్తె శబరి మాత్రమే మాతో ఉన్నారు.’ అని పుందరేశ్వరి స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..