విస్తరిస్తున్న మాయ రోగం.. కోడి గుడ్లు, చికెన్ అమ్మకాలను నిషేధించిన అధికారులు..!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్న కోళ్ల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. సదుం మండలాల్లోని పలు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాగా ఇప్పుడు కార్వేటి నగరంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. RKV పేట, ఇందిరా కాలనీ కోళ్ల ఫారంలో వేల సంఖ్యలో మరణించిన కోళ్లను జిల్లా యంత్రాంగం గుర్తించింది.

విస్తరిస్తున్న మాయ రోగం.. కోడి గుడ్లు, చికెన్ అమ్మకాలను నిషేధించిన అధికారులు..!
Poultry Farms

Edited By:

Updated on: Feb 10, 2026 | 7:47 AM

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్న కోళ్ల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. సదుం మండలాల్లోని పలు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాగా ఇప్పుడు కార్వేటి నగరంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. RKV పేట, ఇందిరా కాలనీ కోళ్ల ఫారంలో వేల సంఖ్యలో మరణించిన కోళ్లను జిల్లా యంత్రాంగం గుర్తించింది. వాటిని తగిన జాగ్రత్తలతో పూడ్చి పెడుతోంది.

సోమవారం (ఫిబ్రవరి 9) ఒక్కరోజే వెయ్యికి పైగా కోళ్లు మరణించడంతో ఆందోళన కలిగిస్తుంది. దీంతె అధికారులకు స్థానికులు, పౌల్ట్రీ ఫామ్ యజమానులు సమాచారం ఇచ్చారు. కోళ్ల మరణాలను అధికారులు వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.గ్రామాన్ని సందర్శించాలని పశు సంవర్త శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించగా కోళ్ల ఫారాలను పరిశీలించి వివరాలను, బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి పై పశుసంవర్ధక శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇప్పటికే మరణించిన కోళ్లను జేసీబీల తో పెద్ద గొయ్యి తవ్వి పాతిపెట్టినట్లు అధికారులు అధికారులు తెలిపారు. కోళ్ల సామూహిక మరణాలకు గల కారణాలపై ప్రాథమికంగా విచారణ చేపట్టారు. వ్యాధి నిర్ధారణ కోసం కోళ్ల బ్లడ్ శాంపిల్స్ ను భోపాల్ లోని ల్యాబ్ కు పంపిన అధికారులు కోళ్ల మరణాలకు గల కారణాలు తెలిసేంతవరకు కోడి గుడ్లను, కోళ్లను ఎవరికి అమ్మకూడదని ఆదేశించారు. అలాగే కోళ్ల ఫారం లోకి ఇతరులను, వాహనాలను అనుమతించవద్దని యజమానులకు అధికారులు ఆదేశించారు.

మరోవైపు చిత్తూరు జిల్లాలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ భయంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక రాపిడ్ టీం ఏర్పాటు చేసింది.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. టెలి కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేసారు జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వ్యాధి నిర్ధారణ కోసం శాంపిల్స్ ఎన్ ఐ హెచ్ ఎస్ ఏ డి కి పంపిన అధికారులు పౌల్ట్రీ ఫార్మ్ నిర్వహకులు బయో సెక్యూరిటీ నిబంధనలు పాటించాలని ఆదేశించారు.

జిల్లాలో వేల సంఖ్యలో కోళ్ల ఫారాలు ఉండగా లక్షల సంఖ్యలో కోళ్ల పెంపకం కొనసాగుతుంది. జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కోళ్ల ఎగుమతి కొనసాగుతుండడంతో బర్డ్ ఫ్లూ విస్తరిస్తే కోళ్ల పరిశ్రమ కుదేలయ్యే అవకాశం ఉందని భావిస్తున్న అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. బర్డ్ ఫ్లూ మాయ రోగం వ్యాప్తి, తీసుకుంటున్న చర్యలుపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక రూపంలో తెలియజేస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..