AP Crime News: విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్‌.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం..

Guntur Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు

AP Crime News: విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్‌.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం..
Road Accident

Updated on: Feb 05, 2022 | 7:34 AM

Guntur Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు (Students) దుర్మరణం చెందారు. ఈ రోడ్డు ప్రమాదం గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో జరిగింది. ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తూ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు విద్యార్థులు అక్కడిక్కడే మృతిచెందారు. మృతులు పెనుమాక వాసులుగా గుర్తించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ( Mangalagiri) పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు మృతిపై వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మంగళగిరి పోలీసులు తెలిపారు.

కాగా.. ముగ్గురు విద్యార్థులు ఎక్కడి నుంచి వస్తున్నారు.. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాలను ఆరాతీస్తున్నారు. పెనుమాక గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మరణించడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Visakhapatnam: విశాఖ జిల్లాలో దారుణం.. మత ప్రార్థనల పేరుతో మహిళలపై ఆకృత్యాలు.. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు..