AP Politics: 3 గుర్తులు.. 38 లెక్కలు.. పొత్తులు కుదిరినా సర్దుబాటు సవాలేనా?

|

Mar 11, 2024 | 7:36 PM

ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తులు కుదిరాయి. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. హస్తిన వేదికగా సీట్ల లెక్కలు కూడా తేలాయి, కానీ ఎవరెక్కడ అనే సర్దుబాటుపైనే రచ్చ జరుగుతోంది. సొంతపార్టీ నేతలను బుజ్జగిస్తూనే... చంద్రబాబు నివాసమే కేంద్రంగా మూడుపార్టీలు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.

AP Politics: 3 గుర్తులు.. 38 లెక్కలు.. పొత్తులు కుదిరినా సర్దుబాటు సవాలేనా?
Big News Big Debate
Follow us on

క్షేత్ర స్థాయిలో పార్టీల బలబలాలు ఎలా ఉన్నాయనే అంశాలను బేరీజు వేసుకునే సీట్ల కేటాయింపు జరుగుతుందని ఇప్పటికే ప్రకటించాయి మిత్రపక్షాలు. ఇందులో భాగంగా జనసేన- బీజేపీ రెండు పార్టీలకు కలిపి 30 అసెంబ్లీ నియోజకవర్గాలు, 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించింది టీడీపీ. అభ్యర్థుల జాబితా, మూడు పార్టీల సీట్ల షేరింగ్ పై కసరత్తు కొనసాగుతోంది. ఒకట్రెండు రోజుల్లోనే లిస్ట్‌ ఫైనల్ అవుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. పొత్తులు, సీట్ల సర్దుబాటు సీన్ ఢిల్లీ నుంచి ఏపీకి మారింది. నిన్న పురంధేశ్వరి, పవన్‌తో బీజేపీ కేంద్ర బృందం భేటీ కాగా… ఇవాళ పవన్‌, చంద్రబాబులతో సుదీర్ఘంగా చర్చించింది. కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, జయంత్‌ పాండా, శివప్రకాష్‌ చర్చలు జరిపారు.

అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చర్చల్లో లేకపోవడంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ సాగింది. పార్టీ ప్రొసీజర్‌ ప్రకారమే చర్చలు జరుగుతాయని.. తాను లేకపోవడం అనేది పెద్ద విషయం కాదంటున్నారు పురంధేశ్వరి. సీట్ల విషయంలోనూ కేడర్‌ అంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్నారు.

అటు టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు అపవిత్రమన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. నాడు చంద్రబాబు అతిపెద్ద వెన్నుపోటుదారుడు అని విమర్శించిన బీజేపీ ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకుందని ప్రశ్నించారు మంత్రి బొత్స.
రాష్ట్రంలో అవినీతి పాలన అంతానికే పొత్తులు అంటోంది బీజేపీ.

మొత్తానికి పొత్తులు నేపథ్యంలో పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులను ఖరారు చేసే పనిలో మిత్రపక్షాలు ఫుల్‌ బిజీగా ఉంటే.. కౌంటర్‌ యాక్షన్‌తో సిద్ధమవుతోంది అధికారపార్టీ. మరి ఇందులో ఎవరు విజయం సాధిస్తారో…!


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..