Big News Big Debate: పురంధేశ్వరి రాయబారం చేస్తున్నారా? బీజేపీకి తెలుగుదేశం ఇచ్చిన ఆఫరేంటి..?

|

Oct 11, 2023 | 6:50 PM

చంద్రబాబు అరెస్టు అనంతరం ఏపీ రాజకీయాల్లో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని టార్గెట్‌ చేశారు వైసీపీ నేతలు. ఇటీవల ఆమె ఢిల్లీ పర్యటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వరుస ప్రకటనలు చేస్తున్నారు మంత్రులు. చంద్రబాబును జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగానే బీజేపీ అధ్యక్షురాలు హస్తినకు వెళ్లారంటోంది వైసీపీ.

Big News Big Debate: పురంధేశ్వరి రాయబారం చేస్తున్నారా? బీజేపీకి తెలుగుదేశం ఇచ్చిన ఆఫరేంటి..?
Big News Big Debate
Follow us on

చంద్రబాబు అరెస్టు అనంతరం ఏపీ రాజకీయాల్లో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని టార్గెట్‌ చేశారు వైసీపీ నేతలు. ఇటీవల ఆమె ఢిల్లీ పర్యటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వరుస ప్రకటనలు చేస్తున్నారు మంత్రులు. చంద్రబాబును జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగానే బీజేపీ అధ్యక్షురాలు హస్తినకు వెళ్లారంటోంది వైసీపీ. అయితే ప్రాంతీయ, కుటుంబపార్టీల గురించి ఆలోచించాల్సిన అవసరం తమకు లేదని.. ప్రభుత్వ అవినీతిపైనే ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లామంటోంది బీజేపీ.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత ఢిల్లీ టు గల్లీ రాజకీయాలు ఆసక్తిగా మారాయి… ఏపీలోనూ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి… తాజాగా బీజేపీ నేతలపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. కేసులో నుంచి బయటపడేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రంగంలో దిగారన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన పురంధేశ్వరి పార్టీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం నకిలీ మద్యం విక్రయిస్తూ వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడుతుందని ఫిర్యాదు చేశారు. అయితే మద్యంపై పోరాటం ముసుగులో టీడీపీ తరపున బీజేపీ అధ్యక్షురాలు రాయబారం చేస్తున్నారన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి అంబటి రాంబాబు.

చంద్రబాబు అరెస్టు విషయంలో స్టాండ్‌ క్లియర్‌గా ఉందన్నారు బీజేపీ నాయకులు. అరెస్టు అయిన తీరును మాత్రమే ఖండించామన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలిపై తప్పులు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. మద్యంపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేయగానే వైసీపీ భుజాలు తడుముకుంటున్నారని ఆరోపించారు.

మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంపైనా మాటలయుద్ధం నడుస్తోంది. జైల్లో రక్షణ లేదని అనారోగ్యం పాలయ్యారని టీడీపీ సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వెంటనే జైలు నుంచి ఆసుపత్రికి తరలించాని సీపీఐ నారాయణ డిమాండ్‌ చేయగా… అవసరం లేదన్నారు. సింపతీ కోసం ఉక్కపోత డ్రామాలు ఆడుతున్నారని.. ఆయన ఉన్నది వెల్‌నెస్‌ సెంటర్‌ కాదన్నారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌.

అరెస్టులో బీజేపీ పాత్ర ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు.. చంద్రబాబును విడిపించడానికి బీజేపీ నేతలు రంగంలో దిగారని వైసీపీ అంటోంది. ఇంతకీ ఎవరు ఎటు ఉన్నారు? ఎవరి కోసం ఎవరు పనిచేస్తున్నారు? లెఫ్ట్‌ పార్టీలు చంద్రబాబు పట్ల సానుభూతి చూపించడం వెనక రాజకీయ వ్యూహం ఉందా?

బిగ్ న్యూస్ బిగ్ డిడేట్ లైవ్ వీడియో చూడండి..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..