Ananthpur District: అనంతపురం జిల్లాలోని రొళ్ల మండల కేంద్రంలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ జరిగిన భూతప్ప ఉత్సవాలకు ఏపీ, కర్ణాటక(Karnataka) నుంచి వేలాదిగా తరలివచ్చారు భక్తులు. భూతప్పల కాలి స్పర్శ కోసం, వేల సంఖ్యలో భక్తులు తడిబట్టలతో బోర్లా పడుకొని వేచి చూశారు. ఉర్రాల శబ్దాలకు అనుగుణంగా నడుస్తూ, భక్తులను కాలితో తొక్కుకుంటూ వెళ్లారు భూతప్పలు. లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి అరటిపండ్లు కలిపిన బొరుగుల రాసులో తలదూర్చి నైవేద్యాన్ని భుజించారు. భూతప్పల స్పర్శ తర్వాత మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలల్లో భూతప్పల ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. భూతప్పల స్పర్శ తగిలితే పిల్లలు లేనివారికి పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి వ్యాధులు నయమవుతాయని, ఇళ్లలో ఉన్న కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు భక్తులు. అందుకే ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యంలో పాల్గొంటారు. భూతప్పల కాలి స్పర్శ కోసం తడిబట్టలతో బోర్లా పడుకొని మొక్కులు తీర్చుకుంటామని చెబుతున్నారు భక్తులు.
Also Read: Telangana: సామాన్యుడికి మరో షాక్.. విద్యుత్ చార్జీల పెంపు.. యూనిట్‌కు ఎంతంటే..?