Bowenpally Kidnap Case: బోయన్‌పల్లి కిడ్నాప్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ఈ కేసులో సిద్దార్ట్ అండ్ టీం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గోవాలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను సహా మిగతా నిందితుల కోసం గాలింపు ప్రక్రియ కొనసాగుతుంది. కాగా నేడు అఖిల ప్రియను కిడ్నాప్ ఉద్దేశంపైనే పోలీసులు విచారించారు.
సెల్ టవర్ లొకేషన్, కాల్ డేటా వివరాలను అఖిల ప్రియ ముందు ఉంచి ప్రశ్నలు వేశారు అధికారులు. అయితే ఇన్వెస్టిగేషన్ టీమ్ అడిగిన కొన్ని ప్రశ్నలకు మాత్రమే అఖిల ప్రియ సమాధానం చెప్పింది. మరికొన్ని ప్రశ్నలకు తనకు గుర్తు లేదంటూ సమాధానం దాటవేసింది. కిడ్నాప్ కేసులో జగత్ విఖ్యాత్ ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అతని డ్రైవర్ దుర్గను అరెస్ట్ చేశారు. రేపటి అఖిల ప్రియ దర్యాప్తు కేసులో కీలకంగా మారనుంది.
Also Read:
Viral News: ఎంత క్రియేటివిటీ..ఎంత క్రియేటివిటీ.. ఖాకీలే కంగుతిన్నారు.. ఎలుక కన్నాల మాటున