
జనవరి 4, 2026న తొలి ట్రైల్ కమర్షియల్ ఫ్లైట్ భోగాపురం రన్‌వే పై దిగడంతో కీలక మైలు రాయి దాటిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మరో ముందడుగు వేసింది. ఉత్తరాంధ్ర ప్రజలు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న బోగాపురం విమానాశ్రయం ప్రయాణీకుల రాకపోకలకు మాత్రమే కాకుండా, సరుకు రవాణా, లాజిస్టిక్స్ రంగాల అభివృద్ధికి కూడా దోహదపడేలా రూపుదిద్దుకుంది. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వే పై జరిగిన అన్ని పరీక్షలు విజయవంతమయ్యాయి. అన్ని సాంకేతిక తనిఖీలు సమయానికి పూర్తవుతున్నాయని సంబంధిత అధికారులు తెలియజేశారు. రూ. 4,700 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతున్న ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటివరకు సుమారు 93 శాతం పనులు పూర్తయ్యాయి. విశాఖపట్నం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం–విజయనగరం సరిహద్దుల్లో ఉన్న ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రలో రవాణా అవకాశాలను విస్తృతంగా పెంచనుంది.
ఇప్పటికే ఈ ప్రాంతం చుట్టూ రియల్ ఎస్టేట్ రంగం గణనీయ ఉత్సాహం సంతరించుకుంది. వీఎంఆర్డీఏ ఆమోదం పొందిన అనేక ప్లాట్లు వెలువడడంతో పెట్టుబడిదారులు, స్థానిక వ్యాపార వేత్తలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. రాబోయే నెలల్లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో పరిసర జిల్లాల్లో ఉపాధి, పరిశ్రమల వృద్ధికి ఇదే కీలక దశగా భావిస్తున్నారు.
అంతేకాకుండా ఇక్కడ వేల కోట్ల పెట్టుబడితో అనేక సంస్థలు దూకుడుగా నిర్మాణం జరుపుతున్నాయి. మరో నాలుగు నెలల్లో విమానాశ్రయ ప్రభుత్వం జరగనున్న నేపథ్యంలో అందుకు కావలసిన అన్ని అనుమతులు చకచకా వస్తున్నాయి. ఈ విమానాశ్రయం ప్రారంభం జరిగితే ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరొక మైలురాయిగా నిలవనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.